All their pensions have been stopped (held) in AP.. They will not be paid from this month, this is the reason!

Ntr Bharosa Pension Scheme 2025 Disabled Quota Money On Hold: ఏపీ ప్రభుత్వం పింఛన్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు సదరంకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం రావాలని పలుమార్లు నోటీసులు అందించారు. కానీ కొందరు ఈ పరీక్షలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వారందరి పింఛన్‌లను హోల్డ్‌లో ఉంచుతున్నట్లు మెసేజ్‌లు పంపించింది. ఆగస్టు 1 నుంచి వీరందరికి పింఛన్ డబ్బులు ఇవ్వరు.. హోల్డ్‌లో ఉంటుందని తెలిపింది.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం వారి పింఛన్‌ల కీలక నిర్ణయం
  • రీ వెరిఫికేషన్‌కు వెళ్లనివారి పింఛన్‌లు హోల్డ్‌లో
  • ఈ మేరకు వారందరికి మెసేజ్‌లు పంపిన సెర్ప్

ఆంధ్రప్రదేశ్‌‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌లపై ఫోకస్ పెట్టింది.. పింఛన్‌ను రూ.4వేలకు పెంచింది, దివ్యాంగులకు అయితే రూ.6వేలు. దీర్ఘకాలిక వ్యాధులు, మంచానికి పరిమితమైన వారికి రూ.10వేలు, రూ.15వేల చొప్పున పింఛన్‌లు అందిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో పింఛన్‌లు తీసుకుంటున్నవారిలో భారీగా అనర్హులు ఉన్నట్లు గుర్తించింది. అందుకే దివ్యాంగుల కోటాలో పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేయిస్తోంది. కొందరికి ఎలాంటి లోపం లేకపోయినా.. లోపం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో.. మరోసారి దివ్యాంగులకు వైద్యులతో తనిఖీలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *