Kapu JAC leaders meet BJP state president

పుట్టపర్తి – రాష్ట్ర వార్త :

సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో జే ఏ సి నాయకులు హరి రాయల్ నాయకత్వం లో బలిజ సంఘ నాయకులు బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ కు కాపు జేఏసీ వినతి పత్రం అందచేశారు.

ఇటీవల కాపుల సమస్యలపై ఇటీవల కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన 12 తీర్మానాలను తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యాలయాలలో అందజేయగా.. తాజాగా బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునికి కాపు జేఏసీ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేయగా జేఏసీ తీర్మానాలకు మాధవ్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు

కాపు జేఏసీ బలపరిచిన తీర్మానాలు ఇవే

1)కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని
2) సమస్యల పరిష్కారంకోసం దశలవారి ఉద్యమం జిల్లా,డివిజన్,మండల స్థాయి సమావేశాలు అనంతరం విజయవాడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బహిరంగ సభలు
3)రాష్ట్రం లో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని
4)కృష్ణా జిల్లాకు,ఐకాన్ బ్రిడ్జ్ కు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిపేరు నామకరణం చెయ్యాలి, కృష్ణదేవారాయలు జయంతిని ప్రభుత్వం ఆదికారికంగా నిర్వహించాలి.
5)కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి
6)హామీ మేరకు రెండు ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి
7)కూటమి ప్రభుత్వం కాపులకు దామాషా ప్రకారం రాజకీయ,నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలి
8)కాపు ఉద్యోగస్తులకు పోలీస్,రెవిన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో పోకల్ స్థానాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని ఉద్యోగుల అణచివేత పై సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
9)రాష్ట్ర విభజన నేపద్యం లో తెలంగాణనుండి ఏపీ లో కలిసిన 7 ముంపు మండలాల మున్నూరు కాపు కుటుంబ సభ్యుల సమస్యలను
పరిష్కరించేందుకు కృషి చేయాలని
10.యం.యస్.యం.ఇ.లో యస్.సి,యస్.టి,బి.సి,మైనారిటీమహిళలకు ఇచ్చే సబ్సిడీ 40శాతం కాపు,తెలగ,బలిజ,ఒంటరి మహిళల అమలు పనిచేయాలని.ఓ.యం.యస్22నుసవరించాలని. 11)రాజధాని ఆమరావతి లో కాపు భవనానికి 5 ఎకారాలు కేటాయించాలి.
12) స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు, కృష్ణదేవరాయలు బారీవిగ్రహలను ఆమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *