Asthma: Causes, Symptoms, and Treatment Methods

ఆస్తమా పరిచయం

వాతావ‌ర‌ణంలో క్రమ‌క్రమంగా చోటుచేసుకుంటున్న మార్పుల వ‌ల‌్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటారు. అందులో ముఖ్యమైన‌ది అస్తమా (ఉబ్బసం) వ్యాధి. ఇది చిన్న పిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషంట్‌ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి.

ముఖ్యంగా వానకాలం, శీతకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ రెండు బుతువుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్‌-డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉన్నట్లయితే దానిని చైల్డ్‌హుడ్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు. అదే కొంత మందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా పెద్దవారిగా ఉన్నప్పుడు అంటే 20 సంవత్సరాల పైబడి ఉన్న వారిలో గనుక ఆస్తమా వస్తే దానిని అడల్ట్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు.

ఆస్తమా రావడానికి గల కారణాలు

ఈ ఆస్తమా వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ  ముఖ్యంగా:

  • వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, దీర్ఘకాలిక జలుబు, సైనస్‌ ఇన్‌ఫెక్షన్స్‌, దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఆహార పదార్థాలలోని రసాయనాల వంటి వల్ల ఈ ఆస్తమా వస్తుంది.
  • చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
  • జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
  • వాయు కాలుష్యం, సిగరెట్‌ పొగ, సెంటు వాసనలు, దుమ్ము, ధూళి మూలానా కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది.
  • యాస్పిరిన్‌ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
  • అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌, మానసిక ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.
  • ఛాతీ బిగుసుకుపోయినట్లు ఉండడం
  • శ్వాసలో ఇబ్బంది రావడం
  • ఆయాసం రావడం
  • విపరీతమైన దగ్గుతో బాధపడడం
  • ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగడం
  • విపరీతంగా గురక పెట్టడం
  • ఊబకాయంతో ఇబ్బంది పడడం
  • గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి
  • ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాలు
  • ఆస్తమా వ్యాధి ఉన్న వారు ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుంటే ఈ వ్యాధి వల్ల కలిగే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు
  • పాలకూర: మెగ్నీషీయానికి పాలకూర మంచి ఆధారము. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది. 
  • రెడ్ క్యాప్సికం: దీనిలో “సి” విటమిన్‌ (ఎస్కార్బిక్ యాసిడ్) ఎక్కువగా ఉంటుంది. ఎర్ర మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ “ఫాస్ఫోడిల్ స్టెరేజ్” అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకొని ఆస్తమాను నివారించడంలో ఉపయోగపడుతుంది. 
  • ఉల్లి: వీటిలో కూడా యాంటీ – ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. 
  • ఆరెంజ్: కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ ‘సి’ ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది. 
  • యాపిల్: యాపిల్‌ లో ఉండే ‘ఫైటోకెమికల్స్’, యాపిల్ తొక్కలో ఉండే ‘లైకోఫిన్‌’ వంటివి అస్తమాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.






		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *