Anasuya: అవును, ఇద్దరు పిల్లల తల్లిని.. బోల్డ్‌గా ఉంటే తప్పేంటి..? రెచ్చిపోయిన అనసూయ

ఇటీవల అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా, వాటిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ప్రశంసలతో పాటు ట్రోలింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేస్తూ ట్రోల్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయింది.టీవీ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టెలివిజన్‌లో తనదైన శైలిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అనసూయ, సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ కలిగిన సెలెబ్రిటీగా గుర్తింపు పొందింది. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇటీవల అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా, వాటిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ప్రశంసలతో పాటు ట్రోలింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేస్తూ ట్రోల్స్‌పై ఘాటుగా రియాక్ట్ అయింది.“నేను ఓ భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని. అయినా గ్లామర్, స్టైల్, కాన్ఫిడెన్స్ నా వ్యక్తిత్వంలో భాగం. నా ఇష్టానికి అనుగుణంగా డ్రెస్సింగ్ స్టైల్‌ను ఎంచుకోవడంలో తప్పేముంది? నేను స్వతంత్రంగా జీవిస్తున్నాను. ఎవరినీ నన్ను అనుకరించమని చెప్పడం లేదు” అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసింది.అంతేకాకుండా తల్లి అయిన తర్వాత బోల్డ్‌గా ఉండడం సరికాదని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తూ “తల్లి కావడం అంటే స్వంత గుర్తింపును కోల్పోవడమా? నా భర్త, పిల్లలు నన్ను నాకిష్టమైన రీతిలో ప్రేమిస్తారు, వారు నన్ను జడ్జ్ చేయరు. వారు నాకు పూర్తి మద్దతుగా ఉంటారు, అదే నాకు ముఖ్యం” అని అనసూయ స్పష్టం చేసింది.తమ అభిప్రాయాలను నెగెటివ్‌గా ఫోర్స్ చేయకుండా, ఇతరుల అభిరుచులను గౌరవించాలని సూచించిన అనసూయ, “మీరు మీ జీవితాన్ని ఎలా బ్రతకాలో మీ ఇష్టం. అలాగే నాకు కూడా నా జీవితాన్ని నా ఇష్టానుసారం బ్రతికే హక్కు ఉంది. మన మధ్య భిన్నాభిప్రాయాలుంటే, వాటిని వ్యక్తిగత దాడులుగా మార్చకుండా శాంతియుతంగా అంగీకరించగలిగితే మనమందరం కలసి ప్రశాంతంగా జీవించగలం” అంటూ నెటిజన్లకు ఓ బలమైన సందేశం ఇచ్చింది అనసూయ.ఇకపై కూడా తన జీవనశైలిని గౌరవంగా, ప్రేమతో, నిర్దోషంగా కొనసాగిస్తానని పేర్కొన్న అనసూయ, ఇతరులు కూడా అదే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. వీలుకుదిరిన ప్రతిసారి నెటిజన్లతో టచ్ లోకి వస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ఆటం బాంబ్ వేస్తుందా అని ప్రతిరోజు లక్షల మంది కుర్రాళ్ళు ఆమె సోషల్ మీడియా ఖాతాను తొంగి చూస్తుంటారు.

