Prabhas: Is this why Prabhas has avoided marriage? Is this the reason why he has not married even after turning 45?

హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమ సంగతులు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా నటీనటుల ప్రేమ, పెళ్లి సంగతులపై నెట్టింట జరిగే చర్చలు అన్నీ ఇన్నీ అని చెప్పలేం. అలా చర్చల్లో ఉన్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు.నాలుగు పదుల వయసొచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన మ్యారేజ్ పై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా అనుష్కతో ప్రభాస్ ప్రేమాయణం కొనసాగుతోందని, అందుకే ఆయన పెళ్లికి దూరంగా ఉంటున్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. కాకపోతే ప్రభాస్, అనుష్క మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.
దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదని, హైదరాబాద్ కి చెందిన ఓ బడా బిజినెస్ మెన్ కూతురుతో ఆయన పెళ్లికి రెడీ అవుతున్నారనే సమాచారాలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై సీక్రెట్ గా అన్ని పనులు చేస్తున్నారనే వార్తలు రావడంతో ప్రభాస్ టీం రియాక్ట్ అయి ఈ వార్తలను ఖండించింది.ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు పుట్టడం కొత్తేమీ కాకపోయినా.. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం మాత్రం ఎప్పటికీ హాట్ టాపికే. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ కారణమని, ఆమెను ప్రభాస్ ప్రేమించారు కానీ ఆమెను పెళ్లి అయిపోవడం కారణంగానే ప్రభాస్ సింగిల్ గా ఉంటున్నారనే కోణంలో వార్తలు పుట్టుకొస్తున్నాయి.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా? ఆమెనే దీపికా పదుకొనే. దీపికాను ప్రభాస్‌ ప్రేమించాడని.. అయితే ఇది వన్‌ సైడ్‌ లవ్‌ అని టాక్‌ అంటున్నారు. గతంలో ప్రభాస్ ఈ విషయమై బహిరంగంగా మాట్లాడటమే ఇందుకు కారణం. హిందీలో ప్రసారమయ్యే ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న సమయంలో ప్రభాస్‌ తన క్రష్‌ ఎవరనే విషయం ఓపెన్ గా చెప్పేశారు.మీకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు అని అడగగానే.. ప్రభాస్‌ ఠకీమని దీపికా పదుకునే పేరు చెప్పారు. దీపికా అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆమెకు పెళ్లయిపోయింది నేనేమీ చేయలేను అని ప్రభాస్‌ అన్నారు. ఇదే పాయింట్ తీసుకొని దీపికాను ప్రభాస్ ప్రేమించారు కాబట్టే పెళ్లి విషయం లేట్ చేశారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *