Fake Apples: యాపిల్స్ ఇలా ఉంటే.. మీరు విషం తిన్నట్లే.. ఈ 4 టిప్స్‌తో నకిలీ పండ్లను గుర్తించొచ్చు!

ఈ రోజుల్లో మార్కెట్‌లో నకిలీ పండ్లు, కూరగాయల ముప్పు రోజు రోజుకీ పెరిగిపోతున్నది. అవి చూడటానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించినా.. వాటి వెనక దాగి ఉన్న రసాయనాల ముప్పు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యాపిల్స్ విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది.వ్యాపార లాభాల కోసం కొందరు వ్యాపారులు యాపిల్స్‌ను ఇంకా మెరిసేలా, ఆకర్షణీయంగా చేయడానికి మైనపు పూతలు, కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ కోటింగ్‌లు వాడుతున్నారు. ఇలా తయారైన నకిలీ యాపిల్ తొలుత కనిపించేందుకు బాగానే ఉన్నా, దీర్ఘకాలంలో ఇవి కాలేయం, కిడ్నీలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.వ్యాపార లాభాల కోసం కొందరు వ్యాపారులు యాపిల్స్‌ను ఇంకా మెరిసేలా, ఆకర్షణీయంగా చేయడానికి మైనపు పూతలు, కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ కోటింగ్‌లు వాడుతున్నారు. ఇలా తయారైన నకిలీ యాపిల్ తొలుత కనిపించేందుకు బాగానే ఉన్నా, దీర్ఘకాలంలో ఇవి కాలేయం, కిడ్నీలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.నకిలీ యాపిల్స్‌ను ఎలా గుర్తించాలి?
సహజ యాపిల్ కొంచెం మృదువుగా, సహజంగా మెరిసిపోతుంది. కానీ నకిలీ యాపిల్ బాగా మెరిసిపోతుంది, స్పష్టంగా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. రంగు ఎక్కువ ముద్దగా ఉంటే, నకిలీ అని అనుమానించవచ్చు. అలాగే ఒక్కోసారి నకిలీ పండ్లపై ముద్దగా తాకినప్పుడు రసాయనపు వాసన కూడా వచ్చేస్తుంది.వాసన ద్వారా గుర్తించండి:
ఒక సహజ యాపిల్‌ను సూటిగా వాసన చూస్తే ఓ తీపి, సహజమైన ఫ్రూటీ స్మెల్ వస్తుంది. కానీ నకిలీ యాపిల్ వాసన లేదనిపించవచ్చు లేదా కొంచెం అసహ్యంగా ఉండే కెమికల్ వాసన వస్తుంది. పండు సహజమైనదేనా కాదా అన్నది వాసన చూసి కొంతవరకూ తేల్చవచ్చు.
