Shravana Masam 2025: Shravan month starts from the 25th of this month.. When are the important festivals?

తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలల్లో ప్రతి నెలకు ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏడాదిలో మొదటి రోజే ఉగాది పండగతో మొదలు అవుతుంది. ప్రతి నెలలో రకరకాల పండుగలు, పర్వదినాలు, శుభ ముహూర్తాలు ఉంటాయి. తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండగలు మాత్రమే కాదు.. శ్రావణ సోమవారాలు, మంగలవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేకత ఉంది. ఈ నేపధ్యంలో శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ప్రముఖ పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం శ్రావణమాసం. ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నిండి.. భక్తి భరితమైన వాతావరణంతో వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తుంది. ఈ సంవత్సరం శ్రావణమాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగష్టు 23వ తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండగలను జరుపుకోనున్నాము. ఈ రోజు శ్రావణ మాసంలోని ముఖ్యమైన పండగలు ఏమిటో తెలుసుకుందాం..నాగ పంచమి:  ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నాగ పంచమి జూలై 29 మంగళవారం జరుపుకోనున్నారు. పుట్టలో పాలు పోసి నాగులను పుజిస్తారు.

వరలక్ష్మి వ్రతం: శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే. మహిళలు సుమంగళీగా జీవించే వరం ఇవ్వమంటూ.. తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలకు, సిరి సంపదల కోసం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అయితే వరలక్ష్మి వ్రతం పున్నమికి మందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతం అని భావిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ఆగస్టు 1,15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మీవ్రతం జరుపుకోవచ్చు.

వారాహి జయంతి: ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం తో పాటు వారాహి జయంతిని కూడా జరుపుకుంటారు.

రాఖీ పండగ: సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకే రాఖీ పండగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శనివారం వచ్చింది. చెల్లెళ్ళు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి రాఖీ పండుగ కూడా జరుపుకోనున్నారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది.

కృష్ణాష్టమి: శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు.

బలరామ జయంతి: శ్రీ కృష్ణుడు అంశ బలరాముడు జన్మదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగష్టు 14వ తేదీన జరుపుకోనున్నారు.

పోలాల అమావాస్య: శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథి. దీనినే పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.

శ్రావణమాసంలో నోములు, వ్రతాలు, పండగుల వివరాలు:

జూలై 25: మొదటి శ్రావణ శుక్రవారం

జూలై 29: మొదటి శ్రావణ మంగళవారం, నాగ పంచమి పండగ

ఆగష్టు 01 : రెండో శ్రావణ శుక్రవారం

ఆగష్టు 05 : శ్రావణ మంగళవారం

ఆగష్టు 08 : మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వారాహి జయంతి,

ఆగష్టు 09 : రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి

ఆగష్టు 12 : మూడో శ్రావణ మంగళవారం

ఆగష్టు 14: బలరామ జుయంతి

ఆగష్టు 15 : నాలుగో శ్రావణ శుక్రవారం

ఆగష్టు 16: కృష్ణాష్ణమి

ఆగష్టు 19 : నాలుగో శ్రావణ మంగళవారం

ఆగష్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం

ఆగష్టు 23 : శనివారం పోలాల అమావాస్య



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *