Good news for those who own bikes, cars, and other vehicles.. From now on, update your mobile number like this …

AP Aadhaar Linked Mobile Number For License: ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్య గమనిక! మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడానికి రవాణా శాఖ వెబ్‌సైట్ sarathi.parivahan.gov.in ద్వారా అవకాశం కల్పించారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండానే, ఆధార్, లైసెన్స్ నంబర్లు నమోదు చేసి ఓటీపీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు. వెంటనే మీ నంబర్లను అప్‌డేట్ చేసుకోండి.

హైలైట్:

  • ఏపీలో వాహనదారులకు అలర్ట్
  • మొబైల్ నంబర్ మార్చుకునే ఛాన్స్
  • చాలా సింపుల్‌గా అప్డేట్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ముఖ్యగమనిక.. ప్రతి ఒక్కరూ వారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీకి సంబంధించి మొబైల్‌ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతం వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా రవాణాశాఖకు సంబంధించి ఏం చేయాలన్నా.. ఆధార్‌తో లింక్ ఉన్న మొబైల్ నంబర్ ద్వార చేయాల్సిందే. అయితే చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్, ఆధార్‌ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్ వేర్వేరుగా ఉన్నాయి. ఈ కారణంతో రవాణశాఖకు సంబంధించిన ఏ పని మీద వెళ్లినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ రెండుచోట్ల వేర్వేరు మొబైల్ నెంబర్‌‌లు ఉండటంతో.. దానిని మార్చుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. అయితే ఇకపై వాహనదారులు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడం కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో మొబైల్ నెంబర్లను మార్చుకునే అవకాశం కల్పించారు. వాహనదారులు మొబైల్ నంబర్ మార్చుకునేందుకు నేరుగా రవాణా శాఖ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు.

రవాణాశాఖ వెబ్‌సైట్‌లో ఆధార్, లైసెన్సు నెంబర్లు నమోదు చేసి ఈజీగా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. దీని కోసం వాహనదారులు sarathi.parivahan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. అందులో అదర్‌ సర్వీసెస్‌ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసిన తర్వాత ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఫోన్‌ నెంబర్‌ మారిపోతుంది. వాహనదారులు చాలా సులభంగా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు అంటున్నారు అధికారులు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీకి సంబంధించి వాహనదారులు వారి మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాదు చాలామంది సంవత్సరాల తరబడి వారి వాహనాలకు సంబంధించి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసి ఉండరు.. అలాంటి వారు కూడా వారి నంబర్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *