Diabetes Signs: ఎలాంటి టెస్టు లేకుండానే షుగర్ వ్యాధిని గుర్తించే టిప్స్.. లక్షణాలు ఇవే

Diabetes Signs: శరీరంలో ఇన్సులిన్ విడుదల మందగించడం లేదా విడుదలైన ఇన్సులిన్ని కణజాలాలు పూర్తిగా వాడుకోకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. క్రమంగా, ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఎక్కువ కాలం రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం కొనసాగితే గుండె, కిడ్నీలతో పాటు లంగ్స్పై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే, ముందుగానే పరీక్షల ద్వారా అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్, డయాబెటిస్‌ను నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే, ఎలాంటి టెస్టులు అవసరం లేకుండానే కొన్ని లక్షణాల ద్వారా షుగర్ ప్రాబ్లమ్‌ను కనిపెట్టవచ్చు. అవేంటో చూద్దాం.
నిరంతర ఆకలి
రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆకలి (Constant Hunger) వేస్తుంది. తగినంతగా ఇన్సులిన్ రిలీజ్ కాకపోవడం, ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) కారణంగా శరీర కణాలు గ్లూకోజ్‌ని పూర్తిగా గ్రహించలేవు. దీంతో, ఆ కణాలకు శక్తి అందక ఎనర్జీ కోసం ఎదురు చూస్తుంటాయి. ఈ క్రమంలో శరీరానికి అవసరం లేకపోయినా మెదడు ఆకలిని ప్రేరేపిస్తుంది. తిన్న తర్వాత కూడా ఆకలి సిగ్నళ్లు రావడం పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్‌కి సంకేతం. చర్మం పొడిబారడం, దురద
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే.. బాడీలో డీహైడ్రేషన్ కలుగుతుంది. దీంతో చర్మం పొడిగా (Dry Skin) మారి దురదను (Itching) కలగజేస్తుంది. సాధారణంగా ఈ సంకేతాలను తేలికగా తీసుకుంటారు. అయితే, తరచుగా ఈ లక్షనం కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. చర్మంపై నిరంతరం కలిగే దురద నుంచి ఉపశమనానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నప్పటికీ తగ్గకపోవడం డయాబెటిస్‌కు సంకేతం.తరచుగా మూత్రవిసర్జన
డయాబెటిస్, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ప్రారంభ లక్షణాలలో ఒకటి తరచుగా మూత్ర విసర్జన (Frequent Urination). ముఖ్యంగా, రాత్రి సమయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కిడ్నీలు అదనపు షుగర్‌ని ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా శ్రమిస్తాయి. దీంతో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. మీకు కూడా రాత్రిపూట అకస్మాత్తుగా, తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే అది పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ వలనేనని అర్థం చేసుకోవాలి. అమితమైన దాహం
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి అసాధారణ దాహం (Very Thirsty) వేస్తుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మెదడు దప్పిక సిగ్నల్‌ని పంపించి నీటిని తాగేలా ప్రేరేపిస్తుంది. అలసట
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు శరీరం తరచూ అలసటగా, బలహీనంగా కనిపిస్తుంది. బాగా నిద్రపోయినా, సంపూర్ణ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఇలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కణాలకు తగినంత గ్లూకోజ్ అందకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఎనర్జీ లోపించి రోజువారీ పనులు కూడా చేయడంలో అలసిపోతుంటారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లలో ఈ లక్షణం కామన్‌గా ఉంటుంది. చూపు మసకబారడం
బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గుల కారణంగా కంటి లెన్స్ వాపుకు కారణమవుతాయి. ఇది కంటి ఆకారాన్ని మారుస్తుంది. దాంతోపాటు, స్పష్టంగా చూసే సామర్థ్యాన్ని ప్రభావితం చేసి మసక దృష్టికి (Blurred Vision) కారణం అవుతుంది. అకస్మాత్తుగా, పదే పదే దృష్టి బలహీనంగా అనిపిస్తుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌కి సంకేతం.

