వయసు పెరిగినా పిల్లల ఎత్తు పెరగట్లేదా, డాక్టర్ చెప్పే కొన్ని ఫుడ్స్ తినిపిస్తే ఆటోమేటిగ్గా ఎత్తు పెరుగుతారు, అవేంటంటే

వయసు పెరిగే కొద్దీ పిల్లల ఎత్తు పెరిగితేనే తల్లీదండ్రులకి ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా పిల్లలు సరైన ఎత్తు పెరగకపోతే కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా సరైన ఎత్తు పెరగాలంటే ఏ ఫుడ్స్ తినిపించాలో డాక్టర్ చెబుతున్నారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి ఎత్తు కూడా సరైన విధంగా ఉండాలి. దీనికోసం వారికి సరైన ఫుడ్ తినిపించాలి. లేదంటే బిడ్డలు ఎత్తు పెరగరు. పోషకాహారం తీసుకుంటేనే వారి బరువు, ఎత్తు సరిగ్గా ఉంటారు. అలా కాకుండా తక్కువ ఎత్తు ఉంటే వారి ఎత్తుని పెంచేందుకు రకరకాల ఎక్సర్‌సైజెస్ నుంచి పాలు, పాల పౌడర్ ఇస్తుంటారు. దీనికి కారణం అందులోని ప్రోటీన్ కారణంగా పిల్లలు ఎత్తు పెరుగుతారు. వారికి సరైన మోతాదులో ప్రోటీన్ అందితే ఎత్తు పెరుగుతారు. దీనికోసమే పిల్లల డైట్‌లో ప్రోటీన్ ఫుడ్స్, డ్రింక్స్ ఇవ్వడం మంచిదని చెబుతున్నారు.పిల్లల ఎత్తు పెరగడానికి పాలు, పాలతో తయారైన పెరుగు ఇవ్వొచ్చు. పాలలో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది.
అన్ని రకాల పప్పు ధాన్యాలు తినిపించొచ్చు. పప్పు ధాన్యాల్లోని ప్రోటీన్, విటమిన్స్ పిల్లలకి మేలు చేస్తాయి.
రాజ్మా, కాబూలి చనా అంటే తెల్లని శనగపప్పు కూడా పిల్లలకి తినిపించొచ్చు.
సోయాబీన్‌తో తయారైన టోఫు కూడా మంచిది.
పీనట్ బటర్ మంచిది. సాఫ్ట్‌గా చేసి ఇవ్వొచ్చు.
డ్రైఫ్రూట్స్ పౌడర్ కూడా పిల్లలకి ఇవ్వొచ్చు.
- పిల్లల ఎత్త పెరగడానికి వారికి గుడ్లు ఇవ్వొచ్చు.
- చికెన్ కూడా మంచిది.
- డ్రైఫ్రూట్స్‌తో పాటు నట్స్ తినిపించొచ్చు
- విత్తనాలని తినడం ద్వారా పిల్లలకి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వొచ్చు.
- ఆకుకూరల్లో విటమిన్స్, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల్ని బలంగా చేస్తాయి. కాబట్టి, వాటిని కూడా తినిపించొచ్చు.
- అరటిపండ్లు, మామిడిపండ్లు, బెర్రీస్ విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు పిల్లల ఎదుగుదలకి మంచివి.
- వీటితో పాటు క్యారెట్స్, చిలగడదుంపలు కూడా తినిపించొచ్చు.
- పిల్లల ఆహారంలో రాగుల వంటి హోల్ గ్రెయిన్స్ యాడ్ చేయడం మంచిది.

