జంక్‌ఫుడ్‌కి అలవాటు పడి మీ పిల్లలు ఇంట్లో వండిన హెల్దీ ఫుడ్ తినట్లేదా, ఇప్పుడు చెప్పినట్లుగా చేస్తే కావాలని అడిగి మరీ పోషకాహారాన్ని తింటారు

ప్రజెంట్ జనరేషన్ జంక్‌ఫుడ్‌కి ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు. ఈ కారణంగా అధికబరువు, ఊబకాయం, షుగర్ లెవల్స్, బీపి, నిద్ర సమస్యలు, కీళ్ల నొప్పులు, ఉబ్బసం, గుండె సమస్యల వంటివి చిన్నతనంలోనే వస్తున్నాయి. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే జంక్‌ఫుడ్‌ని తగ్గించాలి. దీనికోసం పేరెంట్స్‌గా మనమేం చేయాలంటే పోషకాహారం ప్రతీ ఒక్కరూ తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ, పెద్దవాళ్ళం మనకే ఒక్కోసారి జంక్‌ఫుడ్ తినాలనిపిస్తుంది. అదే చిన్నవారి క్రేవింగ్స్‌ని అస్సలు ఆపలేం. దీంతో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడానికి చూపించే ఇంట్రెస్ట్ పోషకాహారంపై చూపించరు. కానీ, ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల బరువు పెరగడం దగ్గర్నుంచీ ఎన్నో సమస్యలొస్తాయి. వీటన్నింటిని దూరం చేసి పిల్లల చేత పోషకాహారం తినిపించాలంటే పేరెంట్స్ కొన్ని ఫాలో అవ్వాలి.
పోషకాహారం మంచిదే అయినప్పటికీ దానిని తీసుకోవడం కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తుంది. అలా కాకుండా దానిని క్రియేటివిటీగా ఉండేలా చూడండి. ఉదాహారణకి పిల్లలు కూరగాయలు తినేలా చేయాలంటే కొన్ని రకాల సాసెస్, డిప్స్‌ని ట్రై చేయండి. అదే విధంగా గుడ్లని ఉడకబెట్టి ఇచ్చినప్పుడు వాటిని కట్ చేసి మిరియాల గింజలు, నల్లని నువ్వులతో కళ్ళని డిజైన్ చేయండి. దీంతో చూడ్డానికి అట్రాక్టివ్‌గా ఉంటాయి. నోటికి రుచిగా ఉంటాయి. తినడానికి ట్రై చేస్తారు. అయితే, వారికిచ్చినప్పుడు కాస్తా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతారు.
ప్రతీ విషయంలోనూ పిల్లలు పేరెంట్స్‌ని అనుకరిస్తారు. కాబట్టి, వారిని తినే ముందు మీరు తినండి. మీరు హెల్దీగా తినడం స్టార్ట్ చేయండి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండండి. దీంతో మీలానే వారు కూడా ట్రై చేస్తారు. హెల్దీ ఫుడ్ తింటారు.
తినడానికి ఏ హెల్దీ ఫుడ్స్ లేనప్పుడు, తయారుచేయడానికి టైమ్ పట్టినప్పుడే పిల్లలు ఇతర ఫుడ్స్‌ని తీసుకుంటారు. కాబట్టి, అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరే మంచి ఫుడ్స్, స్నాక్స్ ప్రిపేర్ చేసి ఉంచండి. మీరు తీసుకొచ్చే ఫుడ్స్ కూడా హెల్దీగా ఉండాలి. నట్స్, పాప్‌కార్న్, ఫ్రూట్స్, పెరుగు వంటివాటిని తీసుకొచ్చి ఉంచండి.

