Fish Health Tips: ఈ 5 రకాల చేపలు పొరపాటున కూడా తినొద్దు.. వీటిని తిన్నారంటే బకెట్ తన్నాల్సిందే!

కొన్ని రకాల చేపలు ఆరోగ్యానికి హానికరం. మాగుర్, మాకెరెల్, ట్యూనా, పాన్కల్మాచ్, పంగాస్, తిలాపియా చేపలు అధికంగా పాదరసం, హార్మోన్లు కలిగి ఉంటాయి. గర్భిణీలు, చిన్న పిల్లల తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి.చేపలు మన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్లు అందించే ఆహారం. చికెన్, మటన్ కంటే చేపలు తినడమే మంచిదని చాలా మంది నిపుణులు చెబుతారు. కానీ, అన్ని రకాల చేపలు ఆరోగ్యానికి మంచివి కావు. కొన్ని రకాల చేపల్లో అధికంగా పాదరసం (Mercury), హార్మోన్లు, ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి.ఇవి శరీరానికి మేలుకు బదులు ముప్పుగా మారతాయి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లల తల్లులు, లేదా తల్లులు కావాలనుకునే మహిళలు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు తినడం వల్ల పుట్టబోయే శిశువు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.తినకూడని చేపల జాబితా:
మాగుర్ చేపలు:
పెద్ద పరిమాణంలో ఉండే మాగుర్ చేపలు వేగంగా పెరిగేందుకు హార్మోన్లు ఇంజెక్ట్ చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీటిలో చిన్న పరిమాణం ఉన్న చేపలే ఎంచుకోవడం మంచిది.మాకెరెల్ (Mackerel):
రెస్టారెంట్లలో ఎక్కువగా వాడే ఈ చేపల్లో మెర్క్యురీ అధికంగా ఉంటుంది. దీని తినడం వల్ల శరీరంలో పాదరసం పేరుకుపోయి గుండె, కిడ్నీ, నరాల వ్యవస్థలపై చెడు ప్రభావం చూపుతుంది.

