Diabetes Symptoms: షుగర్ వ్యాధి ఉన్నోళ్లకు చిన్న చిన్న గాయాలు తగిలినా ఎందుకు నయం కావో తెలుసా? ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

మధుమేహంతో బాధపడేవారిలో తరచూ కనిపించే ప్రమాదకరమైన సమస్య డయాబెటిక్ ఫూట్. ఇది పాదాల్లో నరాల నష్టం, రక్త ప్రసరణలో ఆటంకం వల్ల ఏర్పడుతుంది. చిన్న గాయాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. దీని లక్షణాలు, నివారణ విధానాలపై పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. డయాబెటిక్ ఫూట్ అనేది మధుమేహం ఉన్నవారిలో సాధారణంగా వచ్చే ఒక తీవ్రమైన సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అధికంగా ఉండటం వల్ల పాదాల్లోని నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల పాదాల్లో అనుభూతి తగ్గడం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల చిన్న గాయాలు కూడా త్వరగా మానకుండా, ఇన్ఫెక్షన్లకు దారితీసి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తాయి. డయాబెటిక్ ఫుట్ పూర్తి వివరాలు తెలియాలంటే లోకల్ 18 అందించే ఈ వీడియో చూడాల్సిందే…
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన డాక్టర్ తన్వీర అలీ ఖాన్ తో లోకల్ 18 మాట్లాడే ప్రయత్నం చేసింది. డయాబెటిక్ ఫూట్ వల్ల కలిగే ప్రమాదాలు, వాటి నివారణ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా గుర్తించాలి స్పష్టంగా లోకల్ 18 తో తెలిపారు. డయాబెటిక్ ఫూట్ రావడానికి ప్రధాన కారణాలు: డయాబెటిక్ న్యూరోపతి (నరాల దెబ్బతినడం): అధిక రక్త చక్కెర స్థాయిల వల్ల పాదాల్లోని నరాలు దెబ్బతింటాయి. దీని వల్ల వేడి, చలి, నొప్పి వంటి వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా, చిన్న గాయాలు, బొబ్బలు లేదా రాపిడిని గుర్తించకుండా వదిలేస్తారు, ఇది అల్సర్లకు దారితీస్తుంది.పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (రక్త ప్రసరణ తగ్గడం): మధుమేహం వల్ల రక్తనాళాలు సంకుచితమై, పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గాయాలు నెమ్మదిగా మాని, ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. మధుమేహం ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది, దీనివల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర స్థాయిలు పాదాల్లోని కండరాలను బలహీనపరిచి, పాదాల ఆకారాన్ని మారుస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాలపై ఒత్తిడి పెరిగి, అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

