PAN Card Scam: Massive fraud in the name of PAN card.. Have you received such a message?

e-PAN Card Scam: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పాన్ కార్డ్‌ అందజేస్తుంది. పాన్‌ అనేది ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. ట్యాక్స్‌ ఫైలింగ్‌, ఇతర ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్లకు పాన్‌ కార్డ్‌ తప్పనిసరి. అందుకే ఇటీవల పాన్‌ కార్డ్‌లకి సంబంధించిన స్కామ్‌లు పెరిగిపోయాయి. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ e-PAN కార్డ్ డౌన్‌లోడ్‌ పేరిట వస్తున్న ఫేక్‌ ఇమెయిల్స్‌ గురించి అలర్ట్‌ చేసింది. ఈ ఇమెయిల్స్‌ పర్సనల్‌ డీటైల్స్‌ దొంగిలించే ట్రిక్‌ కావచ్చు. లేదా హానికరమైన లింకులు ఉండవచ్చు. ప్రజలను మోసగించడానికి పంపే ఇలాంటి మెయిల్స్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

ఏం జరుగుతోంది?

‘డౌన్‌లోడ్‌ e-PAN కార్డ్ ఆన్‌లైన్: ఎ స్టెప్‌ బై స్టెప్‌ గైడ్‌’ వంటి టైటిల్స్‌తో మోసపూరిత ఇమెయిల్‌లు అనాథరైజ్డ్‌ సోర్సెస్‌ నుంచి వస్తున్నాయి. ఈ ఇమెయిల్‌లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చినవి కావు. ఇవన్నీ ఫిషింగ్ స్కామ్‌లో భాగం. ఈ మెయిల్స్‌ మీ కంప్యూటర్‌కు హాని కలిగించే లేదా బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌ల వంటి మీ సెన్సిడిట్‌ డేటాను దొంగిలించే లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లను కలిగి ఉంటాయి.

ఫిషింగ్ అంటే ఏంటి? 

ఫిషింగ్ అనేది సైబర్ నేరస్థులు యూజర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం వంటి పర్సనల్‌ డీటైల్స్‌ దొంగిలించడానికి ఉపయోగించే ట్రిక్. వారు బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు లేదా పాపులర్‌ వెబ్‌సైట్‌ తరహాలో ట్రస్టెడ్‌ ఆర్గనైజేషన్స్‌లా నటిస్తూ ప్రజలను మోసం చేస్తారు. ఈ నకిలీ మెసేజ్‌లు ఇమెయిల్ లేదా ఇన్‌స్టంట్‌ మెసేజ్‌ల రూపంలో పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే రియల్‌గా అనిపించే ఫేక్‌ వెబ్‌సైట్‌లు ఓపెన్‌ అవుతాయి.  ప్రైవేట్ ఇన్‌ఫర్మేషన్‌ ఎంటర్‌ చేసేలా ట్రిక్‌ చేస్తాయి. ఈ డీటైల్స్‌ సేకరించి మోసాలకు పాల్పడుతారు. అకౌంట్‌లో మనీ మాయం చేయడానికి ప్రయత్నిస్తారు, ఇతర మార్గాల్లో డేటాని దుర్వినియోగం చేస్తారు.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *