Liver Disease: హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరమే లేదు.. ఈ లక్షణాలు కనిపిస్తే, మీ లివర్ డేంజర్లో ఉన్నట్లే.. జాగ్రత్త!

కాలేయ వ్యాధులను కొన్ని సంకేతాలు సూచిస్తాయి. అవేంటో చూద్దాం. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది మన లివర్ ఫంక్షన్‌ను బట్టి తెలుసుకోవచ్చు. కాలేయం (Liver) మానవ శరీరానికి ఒక పవర్‌హౌజ్‌గా పనిచేస్తుంది. అయితే లివర్ పనితీరు తగ్గినా, ఈ అవయవం దెబ్బతిన్నా టోటల్ బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. జెనిటిక్స్, వైరస్లు, ఊబకాయం, జీవనశైలి కారణాల వల్ల కాలేయ వ్యాధులు వస్తాయి. అయితే వీటికి పెద్దగా లక్షణాలు బయటకు కనిపించవు. కానీ కాలేయ వ్యాధులను కొన్ని సంకేతాలు సూచిస్తాయి. అవేంటో చూద్దాం. కడుపు నొప్పి, అసౌకర్యం
కడుపు నొప్పిని (Stomach Pain) చాలా మంది అజీర్ణం, పొట్ట సంబంధిత సమస్యగా భావిస్తుంటారు. అయితే, కాలేయ ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా కడుపు నొప్పి వస్తుంది. ముఖ్యంగా, కాలేయం ఉండే ప్రాంతంలో నిరంతరం నొప్పి పెడుతుంది.నాభి కుడి ఎగువ భాగంలో, పక్కటెముకల కింద అసౌకర్యం (Discomfort) కలుగుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి నెలల తరబడి ఉంటుంది. ఒక్కోసారి డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు లేదా కదిలినప్పుడు ఈ నొప్పి మరింత పెరుగుతుంది. అలసట
లివర్ ప్రాబ్లమ్ ఉంటే, రాత్రిపూట పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోతున్నట్లు అనిపిస్తుంది. కాలేయ పనితీరు మందగించినప్పుడు రక్తంలోని విష పదార్థాలను పూర్తిగా ఫిల్టర్ చేయలేదు. ఫలితంగా, అవి శరీరంలోనే పేరుకుపోతాయి. దీంతో, తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఇలా అలసటగా ఉంటే, జాగ్రత్త పడాలి. కాళ్ళు, చీలమండలో వాపు
రక్త నాళాల్లో ద్రవాన్ని నిలుపుకోవడంలో తోడ్పడే ప్రొటీన్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. కాలేయం దెబ్బతింటే ఈ ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోయి ద్రవం రక్తనాళాల్లో నిలవదు. చుట్టుపక్కల ఉన్న కణజాలాల్లోకి లీక్ అయ్యి వాపు వస్తుంది. ఎడెమాగా పిలిచే ఈ వాపు తరచుగా నొప్పి లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడిన తర్వాత లేదా కూర్చున్న తర్వాత ఈ సమస్య వస్తుంటుంది. ఫలితంగా, కాళ్లు, చీలమండలో వాపు ఏర్పడుతుంది. ఆకలి లేకపోవడం
కాలేయ సమస్యలు ఉన్న చాలా మందికి ఆకలిగా (Loss of Appetite) అనిపించదు. ఎప్పుడూ వికారం వస్తుంటుంది. డైజేషన్తో పాటు మెటబాలిజంను నిర్వహించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది.కాబట్టి, కాలేయం సరిగా పనిచేయనప్పుడు ఆహార జీర్ణ ప్రక్రియ ప్రభావితం అవుతుంది. ఫలితంగా, ఆకలి తగ్గుతుంది. కొన్నిసార్లు తిన్నతర్వాత కూడా ఆకలిగా అనిపించడం, అనారోగ్యం, కడుపులో నీరు కారడం వంటివి జరగొచ్చు.

