వైకుంఠపురంలో భక్తుల రద్దీ

తెనాలి రాష్ట్ర వార్త : శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు దేవస్థానానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా భక్తులకు కావలసిన ఏర్పాట్లను ఆలయ ఈ.ఓ. శ్రీమతి అనుపమ పర్యవేక్షించి సిబ్బంది కి తగు సూచనలు చేశారు. తెనాలి కొత్తపేట కు చెందిన శ్రీ సంకీర్తన గాన బృందం కొత్తూరి ఆదిలక్ష్మి మరియు వారి బృందం వెంకటేశ్వర గానామృతం ఆలకించారు. బృందంలో వంకదారు సుజాత, ఇమ్మడి సరస్వతి, యచ్యుత పద్మావతి, లక్ష్మి, ఉష, కాత్యాయని, రోజా తదితరులు పాల్గొన్నారు.


