Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు.. చోరీకి యత్నం.. రైల్వే పోలీసుల కాల్పులు …

పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు.. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. పిడుగురాళ్ల మండలం లోని తుమ్మల చెరువు దగ్గర ఈ ఘటన జరిగింది.
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ దొంగతనం యత్నం ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జూన్ 28 రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, ఈ దుండగులు రైలులోకి చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

