పురుగులు పట్టాయని బియ్యం పారేస్తున్నారా..? కేవలం రూ.1 చిట్కాతో ఏడాదంతా సేఫ్..!

వర్షాకాలంలో ధాన్యాన్ని పురుగుల నుండి రక్షించడానికి వేప ఆకులు, అగ్గిపెట్టెలు, వెల్లుల్లి వంటి దేశీ పద్ధతులు ఉపయోగపడతాయి. ఈ చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాలు పడుతుండగానే ఇంట్లో ఉండే ధాన్యంలో పురుగులు కలుస్తాయి. బియ్యం ఓపెన్ చేస్తే చిన్న చిన్న పురుగులు నడుస్తూ కనిపించడమంటేనే చిరాకు కలుగుతుంది. ఒక్కసారి ఆ ధాన్యం కాలుష్యమైతే… వదిలేయడం తప్ప మరో దారి ఉండదు. అలాగే గోధుమలు, పప్పుదినుసులకూ అదే గతి. ఈ పరిస్థితికి పరిష్కారం కోసం మార్కెట్లో కెమికల్ పొడులు, పాకెట్లూ ఎంతో ఉంటాయి.. అయితే అవి ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉండే ప్రమాదం ఎక్కువే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న జుగాడ్ వైరల్ అవుతోంది. అది కేవలం ఒక్క రూపాయికి లభిస్తుంది. దానితో బియ్యం, గోధుమలు, సజ్జలు, పప్పుదినుసులు అన్నీ ఏళ్ల తరబడి సురక్షితంగా నిల్వచేసుకోవచ్చని చెబుతున్నారు.ఇది కొత్త టెక్నాలజీ కాదు. అమ్మమ్మల కాలం నుంచే వస్తున్న దేశీ పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. బార్మర్, జైసల్మేర్ వంటి ఉత్తర భారత గ్రామాల్లో ప్రజలు వర్షాకాలం ప్రారంభం కాగానే ఇంట్లో ఉండే ధాన్యాన్ని ఎండబెట్టి, శుభ్రంగా వడకట్టి, మట్టితో కూడిన గులకరాళ్లు వేరు చేస్తారు. తేమ లేకుండా ఎండబెట్టిన తర్వాతే డ్రమ్ముల్లో నిల్వచేస్తారు. అయితే తేమ లేకపోయినా కొన్ని నెలల్లోనె పురుగులు రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు వారిదగ్గర ఉన్న ఓ సింపుల్ చిట్కా పని చేస్తుంది. కేవలం రూ.1 విలువ చేసే వస్తువుతో వారు ధాన్యాన్ని సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంచుతారు. వేప ఆకా కావొచ్చు… లేదా అగ్గిపెట్టె కావొచ్చు. వేపలో ఉండే చేదు పదార్థాలు పురుగులను దూరం ఉంచుతాయి. వాసనతోనూ వాటిని తిప్పికొడతాయి. అడ్డంగా వారించేస్తాయి. అలాగే అగ్గిపెట్టెలో ఉండే సల్ఫర్ వల్ల కూడా పురుగుల ఉత్పత్తి ఆగిపోతుంది. వీటి వాసన పురుగులకు అసహ్యంగా ఉండేలా ఉంటుంది. అందుకే వేప ఆకులు, అగ్గిపెట్టెలు అనేవి ఈ దేశీ పద్ధతిలో ముఖ్యమైన భాగాలు. ఇవే కాదుఇంకో ఇంటి చిట్కా ఉంది. వెల్లుల్లి. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను డ్రమ్ముల్లో ఉన్న బియ్యంలో వేసేస్తే, దానిలోకి పురుగులు రాకుండా నిరోధించవచ్చు. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వల్ల తెగుళ్లు, పురుగులు దూరంగా ఉంటాయి. ఇవన్నీ మన ఇంట్లోనే ఉండే సామాన్య పదార్థాలే. కానీ వీటి వల్ల ప్రయోజనం అమితంగా ఉంటుంది.ప్రస్తుతం ఇవే చిట్కాలు టిక్‌టాక్ వీడియోలలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. “ఒక్క రూపాయికి ధాన్య భద్రత” అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెమికల్ లేదు, ఖర్చు లేదు, సమస్యే లేదు. ఈ దేశీ చిట్కా ఎంతో మందికి ఉపయోగంగా మారుతోంతి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అమ్మమ్మల జ్ఞానం ఇంటికి రక్షణ కలిగిస్తుంది.

