White Teeth: మీ దంతాలు పసుపు రంగులో ఉన్నాయా ? ఫ్రీగా దొరికే ఈ ఒక్క ఆకు నమిలితే చాలు.. తెల్లగా మెరిసిపోతాయి !

మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉన్నవారు తెలిసే ఉండి ఉంటారు. దంతాలు పసుపు రంగులో ఉన్నాయని కొందరైతే పక్కన ఉన్నవారితో కూడా సరిగ్గా మాట్లాడరు. ఐతే ఇంట్లోనే మీరు మీ పళ్లను తెల్లగా, పరిశుభ్రంగా మార్చుకోవచ్చు. మన దంతాలు (Teeth) తెల్లగా కాకుండా.. పసుపు రంగులో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పసుపు రంగులో దంతాలు ఉంటే.. నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఆలోచిస్తాము. మనలో చాలా మందికి ఇలా దంతాలు పసుపు రంగులో ఉన్నవారు తెలిసే ఉండి ఉంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే.. దంతాలు పసుపు రంగులో ఉన్నాయని సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అమ్మాయిలతో అయితే అసలే మాట్లాడకపోయేవాడు. దంతాలు ఈ రంగులో మారిపోవడానికి పలు కారణాలు ఉంటాయి. దంతాలను శుభ్రపర్చకపోవడం, తినే ఆహారం, క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఇలా మారిపోతాయి. మరీ ముఖ్యంగా తాగే నీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటే.. దంతాలు పసుపు రంగులో మారిపోతాయి.మరికొందరు మహానుభావులు ఉంటారు. అదే.. పాన్ పరాక్, గుట్కా, ఖైనీ నమిలే వారు, సిగరెట్ తాగేవారు. సినిమా థియేటర్లో యాడ్స్ చేస్తేనే తట్టుకోలేము.. అలాంటిది వారి పళ్లను దగ్గరి నుంచే చూస్తే ఇక మనకు వామిటింగ్ వచ్చినంత పని అవుతుంది. వారిని మార్చడం ఎవ్వరితరం కాదు.కానీ.. ఎలాంటి అలవాట్లు లేకపోయినా, ఎంత ట్రై చేసినా పళ్లు తెల్లగా కానివారి కోసం.. అలాగే నలుగురిలో నవ్వడానికి కూడా ఇబ్బంది పడే వారు.. ఈ ఒక్క ఆకు ట్రై చేయండి. ప్రతిరోజూ ఈ ఆకు నమిలితే మీ దంతాలు తెల్లగా మారతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే ప్రతి ఇంట్లో ఉండే తులసి ఆకు. ఈ తులసి ఆకులను డైరెక్ట్‌గా నమలవచ్చు లేదా పొడిగా చేసుకోచ్చు. వీలైతే తులసి ఆకులతో పేస్ట్‌గా కూడా మార్చి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులతో దంతాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. నోటి పరిశుభ్రతను మెరుగుపరుచుకోవచ్చు. తులసిలో హైడ్రాక్సీ అల్లైల్బెంజీన్ ఉందని, ఇది అనేక విధాలుగా మనకు ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో 71% యూజినాల్, 20% మిథైల్ యూజినాల్ ఉంటాయి. ఇది దంత క్షయాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు నోటి ఇన్ఫెక్షన్ల చికిత్సలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తులసి ఆకుతో పాటు.. మరో టిప్ తో కూడా మన దంతాలను మెరుగు పర్చుకోవచ్చు. అదే.. అరటి తొక్క. ఏంటి అరటి తొక్కతో పళ్లను శుభ్రం చేస్తారా ? అని ఆలోచిస్తున్నారా. అవును ఇది శాస్త్రీయంగా రుజువు కాకపోయినా.. అరటి తొక్కతో పళ్లను క్లీన్ చేస్తే మెరుగైనా ఫలితాలు వస్తాయని చాలా మంది ఆరోగ్య నిపుణులు తెలిపారు. అరటి తొక్కలో పోటాషియం, మాంగనీస్, మాగ్నీషియం, మరియు నాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పళ్లపై ఉన్న మైకలు (stains)ను మృదువుగా తొలగించగలవని కొందరు నమ్ముతారు.


News by : V.L

