Lady’s finger Effects: బాబోయ్.. పొరపాటున కూడా వీళ్లు బెండకాయ తినకూడదు.. విషంతో సమానం?

Lady’s finger Effects: బెండకాయలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ, అలెర్జీ, జీర్ణ సమస్యలు, మధుమేహం, కిడ్నీ రాళ్లు ఉన్నవారు తినకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎంత ఆరోగ్యమైనవి అయినా కొందరికి కొన్ని కూరగాయలు పండ్లు అస్సలు పడవు.. అందుకే వైద్యులు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ ఆ పండ్లు, కూరగాయలు తినొద్దు అని పదేపదే చెప్తుంటారు.. అలా కొందరికి మాంసం అయితే మరికొందరికి నేరేడు పండ్లు, జామపండ్లు, బెండకాయలు.. అలా ఎన్నో పోషకగుణాలు ఉన్న బెండకాయలను తినకూడదు అని వైద్యులు ఎవరికి చెప్తారో.. అసలు వాళ్ళు ఎందుకు తినకూడదు? వాళ్లకు విషంగా ఎందుకు మారుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బెండకాయలో మంచి పోషక విలువలు ఉన్నాయి. దీని సమ్మేళనాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ కూరగాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే, ఈ ఆహారపదార్థం అందరికీ ఆరోగ్యకరం కాదు. ఎవరు బెండకాయ తినకూడదో చూద్దాం. అలెర్జీ: బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఈ కూరగాయను తిన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే, దానిని ఆహారంలో చేర్చకపోవడం మంచిది. అలాంటి పరిస్థిలో దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. జీర్ణ సమస్యలు: బెండకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది, ఇది కొంతమందిలో గ్యాస్ మరియు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు బెండకాయ తింటే ఈ సమస్యలు తీవ్రమవుతాయి. షుగర్ లెవల్స్: బెండకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు తగినది కాదు. ఈ కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే భాగాలు కలిగి ఉంటాయి. మధుమేహ రోగులు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేవారు వైద్య సలహా లేకుండా బెండకాయను తినకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు: గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బెండకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కిడ్నీ స్టోన్స్: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బెండకాయ తినకూడదు, ఎందుకంటే ఇది కిడ్నీ సమస్యలను పెంచుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం?
కొన్ని అధ్యయనాల్లో బెండకాయలో ఉండే “కవర్సెటిన్” అనే పదార్థం అధిక మోతాదులో తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గించే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. అయితే ఇది ఇంకా స్పష్టమైన మానవ అధ్యయనాలతో నిర్ధారించబడలేదు. అయినా, అధికంగా తీసుకోవడం మంచిది కాదు.బెండకాయలో ఉన్న పోషకాలు: బెండకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వాటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్, వాపును తగ్గిస్తాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవన్నీ పరోక్షంగా గుండెకు మేలు చేస్తాయి అలాగే గుండె జబ్బులను నివారిస్తాయి. బెండకాయలో ఉండే విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌ను ఎదురుకుంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు ఈ కూరగాయలను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. కాగా ఈ బెండకాయలో విటమిన్ C, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.

