IRCTC: రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. ట్రైన్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, అప్డేట్స్ ఇకపై చిటికెలో..

Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) AI-బేస్డ్ చాట్‌బాట్ ‘ఆస్క్‌దిశ 2.0’ను లాంచ్ చేసింది. ఇది టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రీఫండ్స్, PNR స్టేటస్ చెక్ వంటి సేవలను అందిస్తుంది. ట్రైన్ ట్రావెలింగ్‌ను బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేందుకు ఇండియన్ రైల్వేస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సేవలను మరింత ఈజీగా మారుస్తోంది. ఇందులో భాగంగానే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) AI-బేస్డ్ చాట్‌బాట్ ‘ఆస్క్‌దిశ 2.0’ (AskDISHA 2.0)ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టూల్ మీ ఇంటి నుంచి టికెట్ బుక్ చేసుకోవడానికి, బుకింగ్స్ క్యాన్సిల్ చేయడానికి, రీఫండ్స్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే మాట్లాడటం లేదా టైప్ చేయడం ద్వారా ట్రైన్‌కి సంబంధించిన అప్డేట్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇది రైల్వే ప్రయాణీకులకు వివిధ పనుల్లో సహాయం చేయడానికి డెవలప్ చేసిన AI చాట్‌బాట్. CoRover.ai ద్వారా పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తో ఇంగ్లీష్, హిందీ, హింగ్లిష్, గుజరాతీ వంటి ఇతర భాషలలో మీ రిక్వెస్ట్‌లను అర్థం చేసుకుంటుంది, రెస్పాండ్ అవుతుంది. మీరు మొదటిసారి రైలులో ప్రయాణించేవారైనా లేదా రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తున్నా ఈ చాట్‌బాట్ అన్ని పనులను ఇబ్బంది లేకుండా చేసి పెడుతుంది. టికెట్ బుకింగ్: మీ ప్రయాణ తేదీ, ప్రారంభ స్టేషన్, డెస్టినేషన్, జర్నీ క్లాస్ (స్లీపర్ లేదా AC వంటివి) షేర్ చేయాలి. చాట్‌బాట్ అందుబాటులో ఉన్న రైళ్లు, సమయాలు, సీటు ఆప్షన్లు చూపిస్తుంది. సెక్యూర్ పేమెంట్ ప్రాసెస్‌కి గైడ్ చేస్తుంది. మీ IRCTC పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అథెంటికేషన్ కోసం మీ మొబైల్‌కు వచ్చే OTP ఎంటర్ చేస్తే సరిపోతుంది. టికెట్ క్యాన్సిలేషన్: మీ ప్లాన్స్ మారితే, ‘క్యాన్సిల్ టికెట్’ వంటి సింపుల్ కమాండ్‌తో టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి, బుకింగ్ సెలక్ట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేయండి. మీకు SMS నోటిఫికేషన్ వస్తుంది, మీ అకౌంట్లో క్యాన్సిలేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది.
రీఫండ్: క్యాన్సిలేషన్ లేదా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల స్టేటస్ చెక్ చేయడానికి మీ PNR నంబర్‌ను ఎంటర్ చేయండి. చాట్‌బాట్ తక్షణమే అప్డేట్స్ అందిస్తుంది. మీరు 15 నిమిషాల్లో ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లను మళ్లీ ట్రై చేయవచ్చు. PNR స్టేటస్, ట్రైన్ అప్డేట్స్: మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేయవచ్చు. మీ రైలు సమయానికి వస్తుందా లేదా ఆలస్యమైందో తెలుసుకోవడానికి రియల్ టైమ్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. డేటా స్టోరేజ్: రెగ్యులర్‌గా ట్రైన్ జర్నీ చేసేవారు, ఫ్యూచర్లో ఫాస్ట్ బుకింగ్స్ కోసం డీటైల్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇతర సేవలు: తత్కాల్ టైమింగ్స్ గురించి అడగవచ్చు. మీ బోర్డింగ్ స్టేషన్‌ను ఛేంజ్ చేయడం, IRCTC టూర్ ప్యాకేజీలు, ఫుడ్ ఆర్డరింగ్ ఆప్షన్లు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. బీటా వెర్షన్ లాంచ్ అయినప్పటి నుంచి 60 లక్షలకు పైగా ప్రజలు AskDISHA 2.0ని ఉపయోగించారు, రూ.20 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. ఇది 99% కచ్చితత్వం, 88% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో 95 లక్షల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. రిలయబిటీని ప్రూవ్ చేసుకుంది. AskDISHA 2.0.. IRCTC వెబ్సైట్ (www.irctc.co.in) లేదా IRCTC రైల్ కనెక్ట్ యాప్‌లో 24/7 అందుబాటులో ఉంటుంది. IRCTC వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి హోమ్‌పేజీ బాటమ్-రైట్ కార్నర్లో AskDISHA 2.0 సింబల్‌పై క్లిక్ చేసి, సేవలను వాడుకోవచ్చు.

