Heroine: 23 ఏళ్లకే వ్యభిచారం కేసు.. ఆపై నిర్మాతతో పెళ్లి, కట్ చేస్తే కెరీర్ సర్వనాశనం.. ఈ తెలుగు హీరోయిన్ జీవితమే ఒక సినిమా…

17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో హవా నడిపించిన ఓ హీరోయిన్ 23 ఏళ్లకే వ్యభిచారం కేసు ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకుంది. మరి ఆమె ఎవరు? ఆ వివరాలేంటి అనేది చూద్దామా.. కొందరు హీరోయిన్లు ఇట్టే ప్రేక్షకుల మనసు దోచేస్తుంటారు. చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంటారు. అలాంటి హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే అందాల భామ. కాకపోతే ఈ హీరోయిన్ పర్సనల్ లైఫ్ మాత్రం ట్విస్టుల మయం.
17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో హవా నడిపించిన ఈ చిన్నది.. 23 ఏళ్ల వయసులో వ్యభిచారం కేసులో ఇరుక్కుంది. ఆపై సినీ నిర్మాతను పెళ్లాడి ఏడాది లోపే విడాకులు తీసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా.. అదేనండీ జార్ఖండ్ భామ శ్వేతా బసు ప్రసాద్.
ఈ బ్యూటీ గురించి ఇప్పటి కుర్రకారుకు పెద్దగా తెలియదు కానీ.. అసలు 17 ఏళ్ల కిందట ఈ బ్యూటీ టాలీవుడ్లో సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా యూత్‌లో ఈ బ్యూటీ మాములు ఇంపాక్ట్ చూపించలేదు. అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న కాజల్, సమంత, త్రిష, శ్రియాలను కూడా కాదని.. చాలా మంది యూత్ వాళ్ల గుండెల్లో శ్వేత బసు ప్రసాద్‌ను నింపుకున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో 2008లో శ్వేత బసు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో స్వప్న రోల్లో ఇరగ్గొట్టేసింది. అసలు క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్, మాటల పలుకులు.. భలేగా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే నిబ్బా, నిబ్బి లవ్ స్టోరీ అనిపిస్తుంది కానీ.. అప్పుడు యూత్‌కు ఇదే క్రేజీ లవ్ స్టోరీ.
ఈ మూవీ సక్సెస్ తర్వాత శ్వేత బసు ప్రసాద్ రేంజ్ మారిపోతుంది, స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కానీ.. ఆమె కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. పెద్ద సినిమాల ఆపర్లే రాలేదు. కొత్త బంగారు లోకం తర్వాత.. రైడ్, కాస్కో, కళవర్ కింగ్.. ఇలా చిన్న చిన్న సినిమాలు చేసింది శ్వేతా. అయితే అదే సమయంలో ఆమె చేసిన ఒకే ఒక తప్పు కెరీర్‌ను నాశనం చేయడమే కాకుండా.. ఇప్పటికే మానిపోని గాయంగా మిగిలింది. వ్యభిచారంలో పట్టుబడటం ఆమె జీవితంలో మాయని మచ్చగా మిగిలింది. 2014లో హైదరాబాద్‌లోని ఓ 5 స్టార్ హోటల్లో పట్టుబడింది శ్వేతా బసు. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. అయితే ఇదంతా ఫేక్ అని, కావాలనే తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేసారని చెప్పింది. హైదరాబాద్‌కు ఓ ఈవెంట్ కోసం వెళ్తే ఇలా తనపై నిండా వేశారని తెలిపింది. ఆ తర్వాత కొన్ని నెలలకే శ్వేత బసుపై క్లిన్ చిట్ వచ్చేసింది. ఇది జరిగిన కొన్ని నెలలకు సినీ నిర్మాత రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేత. కానీ ఈ బంధం ఎక్కువకాలం నిలవలేదు. పెళ్లైన 9 ఏళ్లకే ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంది. ఇలా శ్వేతా లైఫ్ లో ఎన్నో ట్విస్టులున్నాయి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే ఉన్న శ్వేతా బసు ప్రసాద్.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తోంది. అవకాశం వస్తే మళ్ళీ హీరోయిన్ గా రాణించడానికి రెడీగా ఉందట ఈ ముద్దుగుమ్మ.

