Rain Alert: వచ్చే నెలలో దంచికొట్టనున్న భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక అప్డేట్!

రైతులకు, ప్రజలకు చాల కీలకమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా. వచ్చే నెలలో వర్షాలు కుమ్మేయనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం చాలా వరకు మందగించింది. మొదట్లో చాలా వేగంగా కేరళను తాకిన రుతుపవనాలు.. ఆ తర్వాత గమనంలో మాత్రం కాస్త మందగించి.. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎండలు ఎక్కువ కావడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ అధిక తేమ వల్ల ఉక్కపోత ఎక్కువగా నమోదవడం వంటి పరిస్థితులు కానవచ్చాయి. అయితే ప్రస్తుతం రెండున్నర రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
ప్రస్తుతం వాతావరణం కూడా చల్లబడుతున్నది. దీనికి కారణం వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలేనని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతం అది మరింత వేగంగా విస్తరిస్తూ వెళుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన సమాచారం ప్రకారం చూస్తే ఈ వారంతో పాటు, జూలై నెల మొదటి రెండు వారాల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అంచనా.ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం చాలా వరకు మందగించింది. మొదట్లో చాలా వేగంగా కేరళను తాకిన రుతుపవనాలు.. ఆ తర్వాత గమనంలో మాత్రం కాస్త మందగించి.. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎండలు ఎక్కువ కావడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ అధిక తేమ వల్ల ఉక్కపోత ఎక్కువగా నమోదవడం వంటి పరిస్థితులు కానవచ్చాయి. అయితే ప్రస్తుతం రెండున్నర రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
ప్రస్తుతం వాతావరణం కూడా చల్లబడుతున్నది. దీనికి కారణం వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలేనని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతం అది మరింత వేగంగా విస్తరిస్తూ వెళుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన సమాచారం ప్రకారం చూస్తే ఈ వారంతో పాటు, జూలై నెల మొదటి రెండు వారాల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అంచనా.

