After 10th What Next: Don’t know which course to take after 10th? Don’t make these mistakes at all..!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2022 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్ధుల్లో ఒకటే కన్‌ఫ్యూజన్‌.. తోటి స్నేహితులు, క్లాస్‌ మెట్స్‌, పక్కింటి వాళ్లు తీసుకున్నారు కదా! అని కళ్లు మూసుకుని ఏదో ఒక కోర్సులో జాయిన్‌ అయినా.. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా..

  • ఇంటర్‌ గ్రూపులు-స్పెషలైజేషన్లు

ఎంపీసీ గ్రూపు: ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. ఇంటర్ తర్వాత ఐఐటీ, నిట్‌, ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్‌శాట్ .. వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించాలంటే ఇంటర్‌లో సరైన పట్టు ఉండాలి. అప్పుడే ఇటువంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు వస్తుంది. ఎంపీసీ తర్వాత బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా కెరీన్‌ను నడిపించుకోవచ్చు.

ఎంఈసీ: ఎంఈసీ గ్రూపులో ఎకనామిక్స్‌, కామర్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుంటాయి. ఎంఈసీ తర్వాత ఎకనామిక్స్‌ ఆనర్స్‌, మ్యాథమేటిక్‌ష్ ఆనర్స్‌, బీఎస్సీలో కంప్యూటర్‌ సైన్స్‌, బీబీఏ, బీకాం, బీఎమ్‌ఎస్, సీఏ, సీఎస్, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

హెచ్‌ఈసీ: ఇంటర్ హెచ్‌ఈసీ గ్రూపులో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌/కామర్స్‌ సబ్జెక్టులుంటాయి. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొందే దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.

  • పాలిటెక్నిక్-స్పెషలైజేషన్లు

ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. యువత సత్వర ఉపాధి పొందేందుకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను ఎన్నుకోవచ్చు. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్యకు ఈ కోర్సులు బలమైన పునాదులు వేస్తాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి మూడున్నరేళ్ల కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. దీనిలో మూడు రకాల కోర్సులుంటాయి. అవేంటంటే.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. దీనిలో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. పదో తరగతి మాత్రమే అర్హత. దీనికి అగ్రి పాలీసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ అర్హత పరీక్షలో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి.

పై చదువులపై పెద్దగా ఆసక్తి లేనివాళ్లు పది అర్హతతో ఉన్న ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే దూరవిద్యలో దారులు వెతుక్కోవచ్చు. కాలేజీకి వెళ్లి చదవడం వీలు కానివారు ఓపెన్‌ స్కూల్‌ లేదా ఇగ్నో నుంచి నచ్చిన కోర్సుల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *