Banana: అరటిపండు తింటే ప్రమాదం.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త..!

పండ్లు ఆరోగ్యానికి మంచివి అనే విషయం అందరికీ తెలిసిందే. వాటిలో అరటిపండు చాలా సాధారణమైనదిగా కనిపిస్తాయి.. కానీ ఇందులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఇవి మంచివే అన్న గ్యారంటీ లేదు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి అరటిపండు హానికరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్ సప్నా సింగ్ చెబుతున్న విషయాల ప్రకారం, అరటిపండ్లను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తినకూడదట. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులుగా కొన్ని సమస్యలను తీసుకురావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ కథనంలో అరటి పండ్లు ఎవరు తినకూడదో తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్నవారు: అరటిపండ్లలో సహజంగా ఉండే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు ఈ చక్కెరలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు వీటిని తగ్గించిన మోతాదులోనైనా తినడం మంచిదే. కిడ్నీ వ్యాధిగ్రస్తులు: అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు బలహీనంగా ఉన్నప్పుడు అధిక పొటాషియం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యలున్నవారు అరటిపండ్లను తినకూడదు. బరువు తగ్గాలని చూస్తున్నవారు: అరటిపండ్లు తక్కువకాలంలో పూట నిండిపోయిన భావనను కలిగించవచ్చు. కానీ ఇవి కాలరీలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తగ్గుకగా తీసుకోవాలి. జీర్ణ సమస్యలున్నవారు: అరటిపండ్లను తిన్న తర్వాత కొందరికి గ్యాస్, ఉబ్బసం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి వారు అరటిపండ్లను పూర్తిగా నివారించడమే ఉత్తమం.అలర్జీ ఉన్నవారు: చాలా మందికి అరటిపండ్లకు అలర్జీ ఉంటుంది. ఇవి తిన్న తర్వాత చర్మంపై ఉబ్బసలు, చర్మ ఎరుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఖాళీ కడుపుతో తినే అలవాటు ఉన్నవారు: అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల వాటిని ఖాళీ కడుపుతో తినడం వికారం, వాంతి వంటి సమస్యలకు దారి తీస్తుంది.

