కొన్ని సంఘటనలు జరిగి ఏళ్లు గడిచినా భక్తుల మదిలో అలాగే నిలిచిపోతాయి. పదే పదే అదే విషయాన్ని మాట్లాడుకున్నా అక్కడ జరిగింది అద్భుతం అనకుండా ఉండలేరు. అలాంటి సంఘటన పుష్కర కాలం క్రితం కేథార్ నాథ్ లో జరిగింది. 2013 జూన్ 16న ఊహించని వరద కేదార్ నాథ్ ను ముంచెత్తింది. భారీ భవనాలు నీట మునిగాయ్, వాహనాలన్నీ పడవల్లా కొట్టుకుపోయాయ్ , రాళ్లు కూడా వరద ధాటికి నిలువలేకపోయాయ్…కానీ ఉత్తరాఖండ్ లో ఇంత బీభత్సం జరిగినా, కేదార్ నాథ్ ఆలయం చుట్టూ జలప్రళయం వచ్చినా ఆలయం చెక్కుచెదర్లేదు.
ఇదంతా శివుడి లీల, భగవంతుడు ఉన్నాడనేందుకు నిదర్శనం అని భక్తులు…
ఇంజినీరింగ్ అద్భుతం ఈ ఆలయ నిర్మాణం అని పరిశోధకులు చెబుతున్నారు..
2013లో ఏం జరిగింది?
2013 జూన్ లో ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు , భయంకరమైన వరదలు, భూకంపాలు సంభవించాయ్. మందాకిని నది పొంగి పొర్లింది. కేదార్ నాథ్ పట్టణం మొత్తం నాశనమైపోయింది.
ఈ వరదల్లో సుమారు 197 మంది మృత్యువాతపడ్డారు
236 మంది గాయపడ్డారు
4 వేల మందికి పైగా గల్లంతయ్యారు
2,119 ఇళ్లు పూర్తిగా – 3,001 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయ్
ఇంత విపత్తు జరిగినా కేదార్ నాథ్ ఆలయం చెక్కుచెదర్లేదు..ప్రకృతి బీభత్సాన్ని ఎదిరించి నిల్చుంది. ఇది కేవలం యాదృశ్చికం కాదు.. పురాతన ఇంజినీరింగ్, భూగోళశాస్త్ర జ్ఞానం, కొన్ని అద్భుత సంఘటనల కలయిక. ఈ విపత్తు తర్వాత ఆలయం చుట్టుపక్కల మట్టి పేరుకుపోయింది కానీ ప్రధాన ఆలయం, శివలింగం దెబ్బతినలేదు. ఇందుకు కారణాలేంటో తెలుసా…?
భీమ శిల (Bhim Shila)
2013 జూన్ 16 రాత్రి 8 గంటల సమయంలో ఆలయం వెనుకున్న కొండపై నుంచి నీటి ప్రవాహం ముంచెత్తుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసిన అక్కడున్న యాత్రికులు పరుగున ఆలయంలోకి చేరుకున్నారు. ఆ భారీ ప్రవాహం ఆలయం వరకూ వచ్చేసింది ఇక ఆలయం కూడా మునిగిపోవడం , అంతా జలసమాధి కావడం ఖాయం అని శివయ్యను ప్రార్థించడం ప్రారంభించారు భక్తులు. అప్పుడే ఓ అద్భుతం జరిగిందని ఆ రోజు అక్కడున్న సాధువులు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు. వరదతో పాటూ పర్వతం పైనుంచి ఓ భారీ రాయి దొర్లుకుంటూ వచ్చింది..ఆ రాయి ఆలయం వెనుకవైపు రాగానే సుమారు 20 అడుగుల దూరంలో ఎవరో ఆపినట్టు ఆగిపోయింది. ఇదే ఆలయానికి రక్షణ కవచంగా మారింది. పైనుంచి దూసుకొచ్చి వరద ఆ రాయి వరకూ వచ్చేసరికి రెండు భాగాలుగా చీలిపోయింది..ఆలయానికి రెండు వైపులా ఆ వరద వెళ్లిపోయింది. నేరుగా వరద తాకకపోవడంతో ఆలయం చెక్కుచెదర్లేదని చెప్పారు ప్రత్యక్షంగా ఈ దృశ్యాన్ని చూసినవారు. ఈ రాయిని ఇప్పుడు భీమశిల అని పూజిస్తున్నారు.
ఇంజినీరింగ్ అద్భుతం
కేదార్ నాథ్ ఆలయం పురాతన నిర్మాణ శైలి, ఇంజినీరింగ్ మెరుగుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 8వ శతాబ్థంలో హిమాలయా నాగర శైలిలో నిర్మించిన ఈ ఆలయ పునాది పెద్ద సవాల్ అనే చెప్పాలి. హిమానినదం నేల, మంచు పై పునాది నిర్మించారు..ఆరు అడుగుల ఎత్తులో దృఢమైన పీఠం నిర్మించారు. పునాదుల్లో పేస్ట్ కోసం..మినపప్పు, బెల్లం, సున్నం మిశ్రమాన్ని కలిపారు. ఆలయం గోడలు 6 అడుగల నుంచి 12 అడుగుల మందం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 400 ఏళ్లుగా అపారమైన ప్రకృతి ఒత్తిడి తట్టుకుని నిలబడిందంటే ఈ రాయి ఎంత బలమైనదో చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను సిమెంట్ లేకుండా ఇంటర్ లాక్ చేశారు. సిమెంట్ లేకుండా పెద్ద పెద్ద రాళ్ల స్లాబ్ లను ఇంటర్ లాకింగ్ టెక్నిక్ తో బిగించారు. ఇది ఎంత ఒత్తిడినైనా తట్టుకుని నిలిచేలా చేసింది. పురాతన ఇంజినీర్లు అక్కడ భూగోళం, వాతావరణాన్ని అర్థం చేసుకుని నిర్మాణం సాగించారు
ఉత్తరం – దక్షిణం దిశలో నిర్మాణం
సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు, పడమర దిశల్లో నిర్మాణం ఉంటుంది. కానీ కేదార్ నాథ్ ఆలయం అక్కడి పరిస్థితులను , వాతావరణం, ప్రకృతి విపత్తులను ముందుగా ఊహించి.. ఉత్తరం-దక్షిణ దిశల్లో నిర్మించారు. వరదనీరు తూర్పు – పడమర దిశగా ఉండబోతోందని గ్రహించి నిర్మించడంతో..ఆ ఫోర్స్ ఆలయంపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టైంది.
ఎలివేటెడ్ లొకేషన్
ఆలయం పురాతన గ్లేషియర్ ఎత్తైన భూభాగంపై ఉంది. ఇది చుట్టుపక్కల నది ప్రవాహం కన్నా ఉన్నతంగా ఉండడం వల్ల మోడరన్ బిల్డింగ్ లు ధ్వంసమైనా ఆలయం సురక్షింతగా నిలిచింది
చారిత్రక సర్వైవల్ , సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్స్ ఆలయం కేవలం 2013వరదల్లోనే కాదు గడిచిన 400 సంవత్సరాలుగా (1300-1900 AD, Little Ice Age) మంచులో కూరుకుపోయినప్పుడు కూడా తట్టుకుని నిలబడింది. ఇన్ స్టట్యూట్ ఆఫ్ హిలాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు ఆలయ గోడలపై పసుపు గీతలు, లోపలి రాళ్ల పాలిషింగ్ లను అధ్యయనం చేశారు.. గ్లేషియర్ కదలికలు, మంచుని తట్టుకుని నిర్మించినట్టు నిర్ధారణ చేశారు.
పాండవులు నిర్మించిన ఈ ఆలయం 1200 ఏళ్ల క్రితం ఆది శంకరాచార్యులు పునర్నించారని చెబుతారు. కేదార్ నాథ్ ఆలయాన్ని సర్వైవల్ దైవిక శక్తి , మానవ మేధస్సు కలయికగా చూడొచ్చు. ప్రకృతి విపత్తులకు వ్యతిరేకంగా సుస్థిర నిర్మాణాలు, భూగోళ అవగాహన ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయి. 2013లో విపత్తు తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మళ్లీ 2014లో తిరిగి తెరిచారు. సైన్స్ అని శాస్త్రవేత్తలు చెబితే..శివుడి ఆజ్ఞ లేనిదే శిలైనా ఆయన సమీపంలోకి రాలేదని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటారు ఆధ్యాత్మికవేత్తలు.

