రోజూ స్కిప్పింగ్ చేయడం మంచిదేనా?

రోజూ స్కిప్పింగ్ చేయడం మంచిదేనా? ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో మన జీవనశైలి చాలా మారిపోయింది. సమయానికి తినకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మరికొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే, ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది..

స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు సంబంధించిన కండరాలు బలపడతాయి. ఇది గుండెకి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందించే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

స్కిప్పింగ్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ వ్యాయామం మీ జీవక్రియను పెంచుతుంది.

ఎముకలు బలపడతాయి..

రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలు, భుజాలు, చేతులు వంటి కండరాలు బలపడతాయి. ఇది ఆస్టియోపోరోసిస్, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బలహీనమైన కండరాలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

డయాబెటిస్ నియంత్రణ..

స్కిప్పింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా, నిద్రలేమితో బాధపడేవారు కూడా రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మంచిగా నిద్రపోతారు.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది..

మీరు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురైతే.. రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.. ఇది శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఈ వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది.

అంతేకాదు, స్కిప్పింగ్ మీ శక్తిని పెంచడంతో పాటూ అలసటను తగ్గిస్తుంది. రోజూ శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ విధంగా రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top