వెనెజువెలా చమురుకు రిలయన్స్‌ ఆర్డర్‌!

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపు, బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

మెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపు, బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. అతిపెద్ద చమురు రిఫైనరీ ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత్‌ నుంచి వెనెజువెలా చమురు కోసం మొదటి ఆర్డర్‌ పెట్టింది. ఈ మేరకు వెనెజువెలాకు చెందిన విటోల్‌, ట్రఫిగురా సంస్థలు ఏప్రిల్‌ నెలలో 20 లక్షల బ్యారెళ్ల చమురు రిలయన్స్‌కు సరఫరా కానున్నట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ చమురును ఒక్కో బ్యారెల్‌పై 7 డాలర్ల వరకు రాయితీపై అందిస్తున్నట్టు పేర్కొన్నాయి.

వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత ఆ దేశ చమురు వ్యవస్థలను అమెరికా నియంత్రణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా నిర్ణయం మేరకే వెనెజువెలా చము రు విక్రయాలు జరగనున్నాయి. కాగా, భారత రిఫైనరీలు ఇప్పటికే ఆర్డర్‌ చేసినమేరకు రష్యా నుంచి చము రు కొనుగోళ్లు జరుగుతాయని, ఒకట్రెండు నెలల పాటు ఇది కొనసాగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top