వైసీపీ మహాపరాధం చేసింది.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రసాయనాలతో తిరుమల (Tirumala) లడ్డూ తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రసాయనాలతో తిరుమల (Tirumala) లడ్డూ తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరి (Mangalagiri)లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిట్ (SIT) నివేదికలో అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం చేసిందన్నారు. జంతు కొవ్వు లేదని నివేదికలో పేర్కొలేదని స్పష్టం చేశారు. అసలు లడ్డూలో వినియోగించిన నెయ్యి ఆవు నెయ్యే కాదని అన్నారు. రూ.400 కిలో నువ్వుల నూనె దొరకదని, అలాంటిది ఆవు నెయ్యి ఎలా వస్తుందని అన్నారు.

వైసీపీ (YCP) నాయకులంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే అసలు సమస్య ఉత్పన్నం అవుతోందని కామెంట్ చేశారు. అదుపుతప్పిన మాటలే దాడులు చేసేలా చేస్తున్నాయని అన్నారు. ఇక జనసేన (Janasena) పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. జనసేన ఒక కులానికి, కుటుంబానికి చెందిన పార్టీ కాదని తెలిపారు. కులం ఆధారంగా పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవని జోస్యం చెప్పారు. యూపీలో కులం మీద పుట్టిన పార్టీలు ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితికి వచ్చాయని అన్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ రోజును జెన్‌జీ డేగా నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top