ఉలవలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే.. అస్సలు వదలరు..

మనకు పోషకాలను ఇచ్చే, ఆరోగ్యానికి మేలు చేసే గింజ ధాన్యాలలో ఉలవలు ఒకటి. ఉలవల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి ఉలవలు ఒక వరం అనే చెప్పొచ్చు.

ఉలవలు (Horse Gram) పోషకాల గని. ఇవి అధిక పోషకాలు, ప్రోటీన్, ఫైబర్ కలిగిన అద్భుతమైన ఆహారం. ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఉలవలు తింటే రేసు గుర్రంలా పరిగెత్తవొచ్చు అనే సామెత ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి, ధృఢమైన ఆరోగ్యం కోరుకునే వారికి ఇవి అద్భుతమైన ఆహారం.

1. అధిక బరువు తగ్గిస్తుంది:

ఉలవల్లో ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది.

2. కిడ్నీలో రాళ్లు:

కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఉలవలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఉలవ చారు లేదా ఉలవలను ఉడికించిన తర్వాత నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రావు.

3. మధుమేహం నియంత్రణ:

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఉలవల్లో ఉండే కాంప్లక్స్ కార్బొహైడ్రేట్ గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తాయి.

4. ప్రోటీన్ నిధి:

శాఖాహారులకు ఉలవలు ఒక అద్భుతమైన ప్రొటీన్ నిధి అని చెప్పొచ్చు. కండరాల పుష్టికి, శరీర నిర్మాణానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

5. రక్త హీనతకు ఉలవలు బెస్ట్:

రక్తహీనతతో బాధపడేవారు తొందరగా అలసిపోతారు. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా ఉలవలను ఎదో ఒక రూపంలో తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. చూపు, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top