తెనాలి:
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, తద్వారా పనిభారం తగ్గించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజినల్ సెక్రటరీ ఆర్. ప్రేమకుమార్ అన్నారు. యూనియన్ బ్యాంక్ నాయకులు శివన్నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఐదు రోజుల పనిదినాలు అన్ని బ్యాంకుల్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు తేనాలి ఎస్బీఐ ప్రాంగణం ముందు నుంచి తెనాలి టౌన్ చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించి తదుపరి నిరసన కార్యక్రమం చేపట్టారు. పలుమార్లు సమన్వయ పరిష్కారానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా సమ్మెకు 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, 8 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనియున్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివన్నారాయణ, పి. సాయి కృష్ణ, విజయ భాస్కర్, మణికంఠ, BOI టీ. చంద్రమౌళి, లక్ష్మీ నారాయణ, కేశవ ధనావత్, అజయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు విశాలే, వీరబాబు, నాగరాజు, లక్ష్మీ, కృష్ణ, APGVB నుండి విజయ్ కుమార్, గిరిరాజు మరియు తెనాలి పట్టణంలోని పలువురు బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ బ్యాంక్ అధికారి సాయి లక్ష్మీరాజు, ఇతర యూనియన్ నాయకులు కూడా పాల్గొని తమ సమస్యలను వివరించారు.
