బ్రిటిష్ పాలనపై ‘రణబాలి’ ఉక్కుపాదం – విజయ్ దేవరకొండ మూవీకి పవర్ ఫుల్ టైటిల్…

విజయ్ దేవరకొండ న్యూ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగిన స్టోరీకి క్రేజీ టైటిల్‌తో పాటు అదిరిపోయే గ్లింప్స్ వదిలారు.

యూత్ ఐకాన్, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ , ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ కాంబోలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా రాబోతోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

పవర్ ఫుల్ టైటిల్… రణబలి

ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ‘రణబాలి’ని ఫిక్స్ చేశారు మేకర్స్. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన స్టోరీ అని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. ‘ఇది స్వాతంత్ర్యానికి సంబంధించిన స్టోరీ కాదు. అంతకు ముందు ఉన్న చీకటి కోణం ఈ స్టోరీ.’ అంటూ స్టార్టింగ్‌లోనే బిగ్ ఎలివేషన్ హైప్ క్రియేట్ చేస్తోంది. బ్రిటీష్ పాలనా కాలంలో ఉన్న పరిస్థితులు, ప్రజలు పడ్డ ఇబ్బందులు, భారతదేశ ధనాన్ని బ్రిటిష్ వారు ఎలా కొల్లగొట్టారు? అనేదే ప్రధానాంశాలుగా స్టోరీ రూపొందించినట్లు తెలుస్తోంది.

పోరాట యోధుడిలా…

బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి ప్రజలకు అండగా ఉండే ఓ యోధుడిలా విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది. హింసకు హింసతోనే సమాధానం చెప్పాలనేలా… మనల్ని దోచుకున్న తెల్లదొరల నుంచి దోచుకుని మళ్లీ తిరిగి పేద ప్రజలకు పంచే ఓ నాయకుడిలా… ప్రజలకు అండగా నిలిచే ఓ వారియర్‌లా గ్లింప్స్‌లో ఎలివేషన్ వేరే లెవల్‌లో ఉంది. ఫస్ట్ గ్లింప్స్‌తోనే ‘రణబాలి’ భారీ హైప్ క్రియేట్ చేస్తోందని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top