అనీల్ రావిపూడికి అదిరిపోయే కానుక

మన శంకరవరప్రసాద్ గారు సినిమా తీసిన అనీల్ రావిపూడికి అదిరిపోయే కానుక అందించింది. ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందుకున్నాడు ఈ దర్శకుడు.

సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కు కొన్ని గంటల ముందు అనీల్ రావిపూడిని తన ఇంటికి ఆహ్వానించారు చిరంజీవి. ఆయనకు తన చేతుల మీదుగా రేంజ్ రోవర్ కారు కీస్ ను అందించారు. అతిపెద్ద బహుమతితో అనీల్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. “మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాధన్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అట్నుంచి అటు అంతా సక్సెస్ సంబరాల్లో కలుసుకున్నారు. సభాముఖంగా మరోసారి చిరంజీవికి థ్యాంక్స్ చెప్పిన అనీల్ రావిపూడి, సినిమా సెట్స్ పై ఉంటుండగానే ‘ప్రత్యేక బహుమతి’ గురించి చిరంజీవిని అడిగేవాడినని బయటపెట్టారు.

“సినిమా షూటింగ్ టైమ్ లో చిరంజీవి గారితో చాలా గారాలు పోయేవాడ్ని నేను. సినిమా హిట్టిస్తే నాకు ఏమిస్తారంటూ సరదాగా అడిగేవాడ్ని. హిట్ ఇవ్వు అప్పుడు చెప్తా అన్నారు. ఆయన ఓ రేంజ్ లో గిఫ్ట్ ఇస్తారనుకున్నాను. కానీ ఏకంగా రేంజ్ రోవర్ బహుమతిగా ఇచ్చారు.”

కెరీర్ లో వరుసగా హిట్లు ఇచ్చాడు అనీల్ రావిపూడి. అతడు హిట్టిచ్చిన ప్రతిసారి ప్రత్యేక బహుమతిపై చర్చ నడుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైమ్ లో స్వయంగా అనీల్ రావిపూడి, స్పెషల్ బహుమతి ఎక్కడంటూ దిల్ రాజుపై సరదాగా సెటైర్లు వేశాడు. ఈసారి మాత్రం చిరంజీవి సినిమాకు భారీ గిఫ్ట్ అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top