77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలు ఉన్నాయి.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలు కూడా ఉన్నాయి. భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని, దేశం యొక్క గొప్ప ఉజ్వల, సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాల ప్రదర్శన జరగబోతోంది.

