మలబద్ధకం + కఫం + దగ్గు ఎన్నో సమస్యలకు ఓ చిన్న పిప్పలి ముక్క చాలు, ఎలా తీసుకోవాలో తెలుసా?

పిప్పలిని భారతీయ ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇది పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతోంది. చరక సంహితలో దీనిని జీర్ణశక్తితో పాటు శ్వాసక్రియను మెరుగుపర్చే మూలికగా అభివర్ణించారు. పిప్పలిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎలా తీసుకోవాలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మనీషా మిశ్రా చెప్పారు. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.
శీతాకాలం పీక్ స్టేజీకి చేరుకుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతులో కఫం, ఛాతీలో కఫం, మలబద్ధకం సమస్యలు తీవ్రంగా ఉంటాయి. వీటిని వదిలించుకోవడం చాలా కష్టం. వీటిని తగ్గించడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మెడిసిన్ వాడితే.. మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకుంటారు.
అయితే, వీటికి చక్కటి పరిష్కారం ఒకటి ఉంది. అదే పిప్పలి. ఒకప్పుడు పిప్పలికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పిప్పలికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని పొడుగ్గా ఉన్న నల్ల మిరియాలతో పోలుస్తారు. ఆయుర్వేదంలో పిప్పలిని ఔషధ గుణాల నిధిగా పరిగణిస్తారు. ఇది రుచి, ప్రభావంలో చాలా శక్తివంతమైన మసాలాగా పరిగణిస్తారు.
పురాతన వైద్య గ్రంథాలు పిప్పలిని జీర్ణక్రియ, శ్వాసక్రియ, రోగనిరోధక వ్యవస్థ బలపేతం చేసే శక్తిగా అభివర్ణిస్తారు. శీతాకాలంలో పిప్పలిని తీసుకోవడం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మనీషా మిశ్రా ఎమ్‌డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. డాక్టర్ మనీషా పిప్పలి ఆయుర్వేద ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో చెప్పారు. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
పిప్పలి మలబద్ధకంతో పాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
పిప్పలి యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే.. ఇది గ్యాస్ట్రిక్ అగ్నిని పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడి.. ఆకలి పెరుగుతుంది. భోజనానికి ముందు నెయ్యితో చిటికెడు పిప్పలి పొడిని తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

