కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎక్కడికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు


కొడాలి నాని చికిత్స పేరుతో అమెరికా వెళ్తారనే అనుమానాలతో టీడీపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది.ఈనేపథ్యంలోనే అన్నీ ఎయిర్పోర్టులు, నౌకాశ్రయాలకు ఆన్లైన్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని దేశం విడిచివెళ్లకుండా చూడాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కృష్ణా జిల్లా పోలీసులు.వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే దేశం విడిచివెళ్లడానికి వీల్లేకుండా నిఘా పెట్టాలన్న టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రీసెంట్గా ఆయన గుండె ఆపరేషన్ పేరుతో ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్లీ చికిత్స పేరుతో అమెరికా వెళ్తారనే అనుమానాలతో టీడీపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది.ఈనేపథ్యంలోనే అన్నీ ఎయిర్పోర్టులు, నౌకాశ్రయాలకు ఆన్లైన్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని దేశం విడిచివెళ్లకుండా చూడాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు కృష్ణా జిల్లా పోలీసులు. ఇక కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన కోలుకుతున్న తర్వాత విచారించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా నానికి అత్యంత ఆప్తుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై 8కేసులున్నాయి. ఈ ఇద్దరు వైసీపీ నేతలు గత ప్రభుత్వ పాలనో అధికారాన్ని చూసుకొని ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుపై, ఆయన కుమారుడిపై నోటికొచ్చినట్లుగా తిట్టడమే కాకుండా చౌకబారు విమర్శలు చేశారు.
రివేంజ్ పాలిటిక్స్..
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే పరిస్థితులు మారినప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం వైసీపీకి చెందిన కీలక నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో గడుపుతున్నారు. ఇక గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా ఇదే పరిస్థితి తలెత్తేలా కనిపిస్తోంది. కొడాలి నాని ట్రీట్మెంట్ పేరుతో విదేశాలకు వెళ్తారనే అనుమానంతో టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ నాని పాస్పోర్ట్ సీజ్ చేసి నిఘా పెట్టాలని..దేశం విడిచివెళ్లకుండా చూడాలంటూడీజీపీకి కంప్లైంట్ చేశారు. టీడీపీ ఫిర్యాదుతో కృష్ణ జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

News by : V.L
Lookout notices issued against Kodali Nani.. Restrictive measures taken to prevent him from going anywhere