పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చింది.

పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చింది. రెండు వారాల క్రితం టూరిస్టులపై టెర్రరిస్టులు జరిగిన పైశాచిక దాడికి ఇండియన్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. సోమవారం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పాక్ తో యుద్ధం కోసం సన్నద్ధం అవుతున్నారని అందరూ అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో వార్ జరుగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మంగళవారం అర్థరాత్రి పాక్ లోకి టెర్రరిస్ట్ క్యాంపులపై భారత సైన్యం మెరుపుదాడులు చేసి మట్టుబెట్టింది.
‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు యావత్ భారతీయులు గర్విస్తున్నారు. జైహింద్ నినాదాలతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. దేశం మొత్తం మీకు తోడుగా ఉందంటూ ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి, సామాన్యుల వరకు అందరూ భారత సైన్యాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. పాకిస్థాన్‌కు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో పాక్ ని ట్రోల్ చేస్తూ కొన్ని ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
News by : V.L

News by : V.L
