స్నానానికి బిస్లరీ వాటర్ కావాల్సిందే.. మేడమ్ రేంజ్ అలాంటిది మరి

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు నటి శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అమ్మ, అక్క, చెల్లి, అత్త వంటి క్యారెక్టర్లతో అలరించారు. ఆమె పండించే భావోద్వేగాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. కేవలం నటనతోనే కాకుండా తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు పాడి డబ్బింగ్తోనూ ప్రేక్షకుల్ని రంజింపచేశారు. హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో శ్రీవిద్య స్టార్డమ్ అనుభవించేవారు. తాను ఏదైనా అనుకుంటే అది కావాల్సిందేనంటూ నిర్మాతలకు చుక్కలు చూపించేవారట. ఈ కోవలోనే ఓ సందర్బంలో స్నానం చేసేందుకు బిస్లరీ వాటర్ తెప్పించుకున్నారంటేనే ఆమె రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.


News by : V.L
Bisleri water is a must for bathing.. Madam range is like that.
