ఆ విషయంలో రష్మికతో పోటీపడుతున్న విజయ్.. యంగ్ హీరోయిన్‌తో జోరుగా రొమాన్స్!


ఈ మధ్య కాలంలో తెలుగులో ఓ రేంజ్ లో వినిపించిన లవ్ జంటలలో సెన్సేషనల్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలది అని చెప్పవచ్చు. ఈ ఇద్దరు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వీరు పాన్ ఇండియా లెవెల్లో మెయిన్ గా తెలుగు యువతలో సెట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంకా కాదు. కాగా అక్కడ నుంచి వీరి నడుమ మొదలైన ప్రేమాయణం ఇపుడు వరకు అలా కొనసాగుతుంది.
ఇద్దరిలో బయట మీడియా ముందు రష్మిక సైడ్ నుంచే తన లవ్ మేటర్ పై ఎక్కువ హింట్స్ రావడం పలు టాక్ షోలలో కూడా రష్మిక ఓపెన్ గానే తనకి కాబోయే భర్త కోసం మాట్లాడ్డం వంటివి టాలీవుడ్ లో కేజ్రీగా మారాయి. ఈ సమయంలో ఇద్దరు కలిసి పలు చోట్ల కనిపించడం విడివిడిగా పోస్ట్ లు చేసినప్పటికీ లొకేషన్స్ ఒకేలా ఉండడంతో తమ లవ్ ని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారని అభిమానులకి నెటిజన్స్ కి క్లియర్ గానే అర్ధం అయ్యింది.
ఇక ఇవి పక్కన పెడితే ఇదంతా బయట కానీ సినిమాలు పరంగా మాత్రం కొంచెం డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఒక లవ్ జంట అయినపుడు హీరో లేదా హీరోయిన్ ఇతర సినిమాల్లో బోల్డ్ సీన్స్ కొంచెం దూరం గానే ఉంటారు. కానీ వీరి విషయంలో మాత్రం అలా లేదు. ఇద్దరూ కలిసి బోల్డ్ సీన్స్ చేశారు కానీ విడివిడిగా మాత్రం రష్మిక విజయ్ కి గట్టి దెబ్బనే కొట్టింది అని పలు సినిమాలు చూసాక టాక్ స్ప్రెడ్ అయ్యింది. మెయిన్ గా గత 2023లో వచ్చిన ఆనిమల్ సినిమాలో బాలీవుడ్ రణబీర్ కపూర్ తో పెదవి ముద్దులు అంతకు మించిన బోల్డ్ సీన్స్ ఎన్నో చేసి రష్మిక హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు విజయ్ పై కూడా చాలా మంది నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ఇక ఈ సినిమానే అనుకుంటే ఇటు గత ఏడాది వచ్చిన పుష్ప 2 లో రష్మిక మందన్న చేసిన రచ్చ చూసి ఇంకా జనం మర్చిపోలేదు.

News by : V.L
