జగదేకవీరుడు-అతిలోక సుందరి రీ రిలీజ్.. రూ.6 టికెట్ బ్లాక్లో రూ.210.. ఇది కదా క్రేజ్ అంటే

మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి జంటగా రూపొందిన క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మరోసారి థియేటర్లలో మాయ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్మీడియాలో అలరిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సమయంలో రూ.6లు ఉన్న టిక్కెట్.. బ్లాక్లో ఏకంగా రూ.210లు అమ్ముడుపోయిందట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వెల్లడించింది. ఈ క్రేజ్ చూసి ఇప్పటితరం ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా..

News By : V.L
