Modi Amaravati Visit: వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు నారాయణ తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు.
అమరావతి, ఏప్రిల్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏపీలో పర్యటించనున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్ షోతో పాటు బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఈరోజు (బుధవారం) పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana), అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు.
రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్‌కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 6500 – 7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
News by VL
