మీ ఫోన్ నుంచి మీ Aadhaar Card మొబైల్ నెంబర్ అప్డేట్ చిటికెలో చేసుకోండి. ఏంటి మీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా? అయితే, ఇక్కడ మేము అందించిన అప్డేట్ వివరాలు క్షుణ్ణంగా చదవండి. దీనికోసం మీరు ఆధార్ సెంటర్ కు వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ మీ వద్ద ఉన్న ఫోన్ లో మీ ఆధార్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.
దేశంలో ఆధార్ యూజర్లకు మరింత సులభమైన సర్వీస్ అందించే లక్ష్యంతో UIDAI కొత్తగా తెచ్చిన ఆధార్ యాప్ లో కొత్త ఫీచర్స్ తో ఇప్పుడు చెబుతున్న విషయం సాధ్యం అవుతుంది. అంటే, కొత్త ఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు మాస్క్ ఆధార్ కార్డు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ కార్డు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
దీనికోసం మీ ఫోన్ లో UIDAI లేటెస్ట్ విడుదల చేసిన ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ ఆధార్ నెంబర్ మరియు మీ సెల్ఫీ తో యాప్ లో మీ ఆధార్ అకౌంట్ యాక్టివేట్ చేయవచ్చు. మీ అకౌంట్ కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుందని గుర్తుంచుకోండి. అదేంటి, ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంటే కొత్త నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫీచర్ కొత్త మొబైల్ నెంబర్ ను పాత నెంబర్ స్థానంలో అప్డేట్ చేయడానికి ఉపయోగించాలి.
మీరు ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వడానికి ఆరు అంకెల పాస్ కోడ్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ‘తాజా లావా దేవీలు’ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఐకాన్ ను పైకి నెట్టండి. ఇక్కడ క్రింద సర్వీసెస్ క్రింద ‘My Aadhaar Update’ ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ పై నొక్కండి, ఇక్కడ మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఈ కొత్త పేజీలో మీకు మొత్తం నాలుగు సర్వీస్ వివరాలు అందుతాయి. వీటిలో మొదటి ఆప్షన్ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంటుంది, దీనిపై నొక్కండి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం ముందుకు సాగడం కోసం ‘కొనసాగించు’ ఆప్షన్ పై నొక్కండి. ఇప్పుడు మీకు మీ పాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది మరియు దాని కింద కొత్త నెంబర్ ఎంటర్ చేయడానికి బాక్స్ అందిస్తుంది. కొత్త నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీరు ఎంటర్ చేసిన కొత్త నెంబర్ పై OTP అందిస్తుంది. ఈ OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే పేమెంట్ కోసం అడుగుతుంది. పేమెంట్ ఎంచుకొని రూ. 75 పేమెంట్ చేయగానే మీ కొత్త నెంబర్ మీ ఆధార్ కార్డు తో అప్డేట్ అవుతుంది.
