పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం… జగన్ దిగ్భ్రాంతి

  • ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి
  • మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు
  • ఈ దుర్ఘటన బాధాకరమన్న జగన్

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *