లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు.. 8వ సారి కూడా బెయిల్ తిరస్కరణ

ప్ చేశారని ఫిట్జ్‌గెరాల్డ్ ఆరోపించారు. ఇవి న్యాయవ్యవస్థేతర ప్రతీకార చర్యల ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని ఆయన అన్నారు.

అయితే, న్యాయమూర్తి ఈ వాదనలను అడ్డుకున్నారు. “భారత ప్రభుత్వానికి నిజంగానే అంత శక్తి ఉంటే, యూకేలో ఎందుకు పట్టుకోలేరు?” అని నీరవ్ మోదీ తరఫు న్యాయవాదిని జస్టిస్ ఫోర్డ్‌హామ్ ప్రశ్నించారు. 

ఏప్రిల్ 2018లో ప్రారంభమైన ఒక రహస్య న్యాయపరమైన విషయం అతడి అప్పగింత ప్రక్రియను ఆలస్యం చేస్తోందని, ఆరేళ్లు జైల్లో ఉండటం చాలా ఎక్కువ అని ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం తరపున వాదించిన నికోలస్ హియర్న్, నీరవ్ మోదీకి నిజంగా భారత ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంటే, ఆయన స్వచ్ఛందంగా భారత్‌కు తిరిగి రావడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు నీరవ్ మోదీ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *